ఆ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫ్లాపైందా..?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో బీ గోపాల్ డైరెక్షన్ లో నటించిన అల్లరి రాముడు సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదనే సంగతి తెలిసిందే.
నగ్మా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అత్త పాత్రలో నటించగా ఆర్తి అగర్వాల్, గజాలా ఈ సినిమలో హీరోయిన్లుగా నటించారు.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పరుచూరి గోపాలకృష్ణ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే అల్లరి రాముడు సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ తప్పలేదని ఆ సినిమా ఫ్లాప్ కావడం వెనుక అసలు కారణం వేరే ఉందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఆ సినిమా కథలో ఎటువంటి మార్పులు చేయవద్దని ఎన్టీఆర్ చెప్పారని కానీ దర్శకత్వ విభాగానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాత్రం ఆ కథలో మార్పులు చేశారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
ఆ మార్పుల వల్లే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని ఆయన అన్నారు.
"""/"/
చాలామంది అల్లరి రాముడు సినిమా బాగా ఆడలేదని అనుకుంటారని కానీ అల్లరి రాముడు బాగానే ఆడిందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.
సీనియర్ డైరెక్టర్ కేవీ రెడ్డి ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ ఎవరు మార్పులు చెప్పినా పట్టించుకునేవారు కాదని ఈ సినిమా విషయంలో కూడా మార్పులు చేయకుండా ఉంటే బాగుండేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు తీసిన బీ గోపాల్ ఎన్టీఆర్ కు మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయారు.
మరోవైపు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో మాత్రమే నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాతే ఎన్టీఆర్ కొత్త సినిమా పనులు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
దాని తరువాత జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాను…సమంత కామెంట్స్ వైరల్!