బిజినెస్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప2.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్( Sukumar , Allu Arjun ) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పుష్ప 2.

గతంలో విడుదలైన పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

పార్ట్ వన్ సినిమా విడుదల అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ను సాధించడంతోపాటు కోట్లల్లో కలెక్షన్స్ ని సాధించిన విషయం తెలిసిందే.

దీంతో పార్ట్ 2 పై ఇప్పుడు భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇకపోతే పుష్ప పార్ట్ వన్ కు వచ్చిన బజ్ కారణంగా పార్ట్ 2 కు జ‌రిగిన ప్రీ రిలీజ్ మార్కెట్ నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి.

"""/" / ఇండియన్ సినిమాల్లో ఒక రికార్డుగా ఉండబోతోందని తెలుస్తోంది.పుష్ప 2( Pushpa 2 ) అల్ లాంగ్వేజెస్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కు విక్రయించారు.

ఇది 275 కోట్ల డీల్ అని తెలుస్తోంది.అయితే ఇది చాలా హయ్యస్ట్ ఫిగర్, రికార్డ్ ఫిగర్ అని చెప్పాలి ఇక హిందీ వెర్షన్( Hindi Version H3 Class=subheader-style) జ‌స్ట్ 200 కోట్ల అడ్వాన్స్ మీద పంపిణీకి ఇచ్చారు.

ఇది రావాలి అంటే హిందీ వెర్షన్ ఎంత వసూలు చేయాల్సి వుంటుంది, ఎంత ఖర్చులు, ఎంత కమిషన్ అనే లెక్కలు కడితే జిగేల్ మనే అంకెలు కళ్ల ముందుకు వస్తుంది.

ఇలా అన్ని భాషలు కలిపి ఆడియో రైట్స్ ను 60 కోట్లకు టీ సిరీస్ కు విక్రయించారు.

ఇది కూడా చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి. """/" / ఇక సౌత్ ఇండియా, ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ ఏ మేరకు వుండబోతున్నాయో అన్నది కూడా చూడాలి మరి.

చాలా సులువుగా 200 నుంచి మూడు వందల కోట్ల మధ్యలో ఉంటాయని టాక్.

మొత్తం థియేటర్ ఫిగర్లు అన్నీ కలిపి, సినిమా విడుదలయ్యాక ఉండే గ్రాస్ ఫిగర్లు ఊహించుకుంటే తెలుగు సినిమా స్టామినా అర్థం అవుతోంది.

డిసెంబర్ 6న విడుదలయ్యే పుష్ప 2 పలు సంచనాలకు దారి తీసేలా కనిపిస్తోంది.

అయితే విడుదల కాకముందే బిజినెస్ విషయంలోనే సంచనాలను సృష్టిస్తున్న పుష్ప 2 విడుదల అయ్యాక ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!