ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. కల్కి సీక్వెల్ విషయంలో ట్విస్ట్ ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఈ ఏడాది కల్కి సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కల్కి సీక్వెల్ పై భారీగా అంచనాలు పెరిగాయి.

కల్కి సీక్వెల్( Kalki 2 ) 2026 సంవత్సరంలో విడుదలవుతుందని చాలామంది అభిమానులు భావించారు.

అయితే కల్కి సీక్వెల్ విషయంలో కల్కి నిర్మాతలు అభిమానులకు ఒకింత భారీ షాక్ ఇచ్చారని చెప్పాలి.

2025 సంవత్సరంలో కల్కి సీక్వెల్ షూటింగ్ మొదలవుతుందని స్వప్న దత్( Swapna Dutt ) చెప్పుకొచ్చారు.

2028 సంవత్సరంలో కల్కి సీక్వెల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.కల్కి సీక్వెల్ కోసం ఏకంగా నాలుగు సంవత్సరాలు ఎదురు చూడాలా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

"""/" / కల్కి సీక్వెల్ లో గ్రాఫిక్స్ కు) ఎక్కువగా ప్రాధాన్యత ఉండటం ఫస్ట్ పార్ట్ ను మించి ఈ సినిమా విజయం సాధించాల్సి ఉండటంతో దర్శకుడు ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కల్కి సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

కల్కి సీక్వెల్ బడ్జెట్ పరంగా కూడా టాప్ లో ఉండనుంది. """/" / కల్కి సీక్వెల్ కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

నాగ్ అశ్విన్ తన ఊహలకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ కల్కి సీక్వెల్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!