కేజీఎఫ్3 కోసం ఎదురు చూసే అభిమానులకు షాకింగ్ న్యూస్.. సినిమా అలా ఉండబోతుందా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2( KGF Chapter1, KGF Chapter2 ) సినిమాలు అంచనాలను మించి విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల ద్వారా నిర్మాతలకు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు వచ్చాయి.

కేజీఎఫ్3 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే కేజీఎఫ్3( KGF3 ) సినిమా గురించి తాజాగా యశ్ ( Yash )మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కేజీఎఫ్3 మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదని యశ్ చెప్పకనే చెప్పేశారు.

కేజీఎఫ్ ఛాప్టర్3 కు సంబంధించి చర్చ జరిగిందని ఒక లైన్ కు సూచనప్రాయంగా ఓకే చెప్పామని అయితే ఈ సినిమాకు ఇది చాలదని యశ్ వెల్లడించారు.

కేజీఎఫ్3 సినిమా అంటే చాలా ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు. """/" / కేజీఎఫ్2 మూవీ దేశ విదేశాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంలో కేజీఎఫ్3 సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అందుకు అద్భుతమైన లైన్ అవసరమని యశ్ అభిప్రాయం వ్యక్తం చేశారట.

ఈ సినిమా మరో మూడు, నాలుగేళ్ల తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కేజీఎఫ్ ఛాప్టర్3 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. """/" / ఈ సినిమా త్వరగా సెట్స్ పైకి వెళితే బాగుంటుందని అభిమానులు చెబుతున్నారు.

కేజీఎఫ్3 ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్( Box Office ) వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో కేజీఎఫ్3 సినిమా గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.