విండోస్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. గూగుల్ క్రోమ్ ఇకపై పని చేయదు!
TeluguStop.com
ఓల్డ్ విండోస్ ఓఎస్‌లపై పీసీలు వాడుతున్నారా.అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్.
గూగుల్ సంస్థ 2023 నుంచి విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లపై రన్ అవుతున్న పీసీలకు క్రోమ్ సేవలు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది.
ఓల్డ్ ఓఎస్ వాడే యూజర్లకు సెక్యూరిటీ ఫీచర్లు, కొత్త ఫీచర్లు అందవు.వీరికి డేటా ప్రైవసీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.
అందుకే గూగుల్ కూడా విండోస్ 7, విండోస్ 8.1 ఓఎస్ ఇప్పటికీ ఉపయోగిస్తున్న యూజర్లను విండోస్ 10, ఆపై వెర్షన్లకి అప్‌గ్రేడ్ కావాలని సూచిస్తుంది.
అంతేకాదు తన క్రోమ్ సేవలు నిలిపేసి వారిని కొత్త వెర్షన్లకి అప్‌గ్రేడ్ అయ్యేలా బలవంతం చేస్తోంది.
గూగుల్ క్రోమ్ వెర్షన్ 110 వచ్చేయడానికి ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.అయితే ఈ అప్‌డేట్ మైక్రోసాఫ్ట్ విండోస్ 7, 8.
1 ఓఎస్‌లకు సపోర్ట్ చేయదని కంపెనీ స్పష్టం చేసింది.నిజానికి కొత్త క్రోమ్ వెర్షన్లు డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకపోయినా విండోస్ 7, విండోస్ 8.
1 వెర్షన్లలో క్రోమ్ పాత వెర్షన్లు వర్క్ అవుతాయి.భవిష్యత్తులో ఎప్పటికీ ఇవే పాత వెర్షన్లు వాడాల్సి వస్తుంది.
కాబట్టి ఆ యూజర్లకు కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందవు.అప్పుడు వారి కంప్యూటర్లలో వైరస్‌లు, మాల్వేర్‌లు ఎంటర్ కావడం చాలా సులభం అవుతుంది.
"""/"/
మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా తమ యూజర్లను విండోస్ 10 లేదా విండోస్ 11కి అప్‌గ్రేడ్ కావాలని సూచించింది.
గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ ఓఎస్ వెర్షన్లకు సపోర్ట్ చేయని సిస్టమ్స్, కొత్త కంప్యూటర్‌ను కొనుగోలు చేయలేని వారికి ఇబ్బంది ఎదురవుతాయి.
మీరు కూడా విండోస్ 7, 8.2 వెర్షన్లపై మీ కంప్యూటర్లను నడిపిస్తున్నట్లయితే త్వరగా లేటెస్ట్ వెర్షన్లకి మారిపోవడం బెటర్.
లేదంటే మీ ప్రైవసీకి ఎంతో ముప్పు ఉంటుంది.
హీరోయిన్ ను అడ్డు పెట్టుకుని బన్నీపై సెటైర్లు వేసిన ప్రముఖ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?