కృష్ణంరాజు తండ్రికి అలాంటి ఉత్తరం వచ్చిందట.. దర్జాగా జల్సాలు చేస్తున్నాడంటూ?

ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో ప్రశంసలను అందుకున్న నటులలో కృష్ణంరాజు ఒకరనే సంగతి తెలిసిందే.

ఆరడుగుల ఎత్తు ఉండే కృష్ణంరాజు సీరియస్ రోల్స్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు.

కృష్ణంరాజు రౌద్ర రసాన్ని అద్భుతంగా పలికించగలరు.సంపన్న కుటుంబంలో జన్మించిన కృష్ణంరాజు కెరీర్ తొలినాళ్లలో నాటకాలు కూడా వేశారు.

ప్రముఖుల సలహా మేరకు కొన్ని సినిమాలలో ఆయన విలన్ రోల్స్ లో నటించి మెప్పించారు.

రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య సినిమాల ద్వారా ఆయన రెబల్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు.

చారిత్రక నేపథ్యంలో కృష్ణంరాజు నటించిన తాండ్ర పాపారాయుడు సినిమా కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

కృష్ణంరాజు హిందీలో ఒక సినిమాను నిర్మించగా ఆ సినిమా పేరు ధర్మాధికారి.నిజ జీవితంలో కృష్ణంరాజు మనసు వెన్న అని ఇండస్ట్రీలో చాలామంది ఆయనను మర్యాద రామన్న అని పిలుస్తారని బోగట్టా.

అయితే కృష్ణంరాజు చదువుకునే సమయంలో ఖరీదైన కారులో కాలేజ్ కు వెళ్లేవారు.కృష్ణంరాజు అలా వెళ్లడం వల్ల చాలామంది ఆయన లెక్చరర్ అని భావించేవారు.

"""/"/ కృష్ణంరాజు జల్సాలను చూసి ఓర్వలేక ఒక వ్యక్తి కృష్ణంరాజు తండ్రికి కృష్ణంరాజు డబ్బును ఇష్టానుసారం ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నాడని కృష్ణంరాజును దారికి తెచ్చుకోని పక్షంలో చేయి దాటుతాడని లేఖ రాశారు.

కృష్ణంరాజు తండ్రి ఆ ఉత్తరం గురించి కొడుకుకు లేఖ రాస్తూ అందులో నీ గురించి ఎవరో ఉత్తరం రాశారని అందులో నువ్వు తప్పులు చేస్తున్నావని పేర్కొన్నారని కానీ నువ్వు తప్పు చేయవని నాకు నమ్మకం ఉందని ఆ లేఖను తాను నమ్మడం లేదని ఆయన సమాధానం ఇచ్చారు.

తండ్రిగా నీకు అవసరమైన అన్నింటినీ సమకూర్చాల్సిన బాధ్యత నాపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆ ఉత్తరం చూసి కృష్ణంరాజు కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం.

ఇదేం పాడు పార్టీ రా బాబు.. పార్టీలో గేమ్ రూల్ విని అమ్మాయికి షాక్‌..