‘జూ’లో షాకింగ్ ఘటన.. తొలిసారి తన బిడ్డను తినేసిన కోతి..
TeluguStop.com
ప్రపంచంలో పాములు, కొన్ని రకాల చేపలు మాత్రమే తమ బిడ్డలను తింటాయి.మనుషులతో సహా ఏ జీవి తమ బిడ్డలను తినేందుకు ఇష్టపడవు.
ముఖ్యంగా అన్ని జంతువులలో మాతృత్వం అనేది కనిపిస్తుంది.తమ బిడ్డకు ఏదైనా ఆపద వస్తే ఏ జంతువైనా కాపాడడానికే ప్రయత్నిస్తుంది.
ముఖ్యంగా మనం కోతులను( Monkeys ) చూసినప్పుడు ఈ విషయం అర్థం అవుతుంది.
తమ బిడ్డలను అవి చాలా అపురూపంగా చూసుకుంటాయి.తమ కళ్ల ముందు బిడ్డలు చనిపోయినప్పుడు కోతులు హృదయ విదారకంగా రోదిస్తాయి.
అయితే ఇటీవల ప్రపంచంలోనే అరుదైన సంఘటన జరిగింది.యూరప్‌లోని చెక్ రిపబ్లిక్‌లోని( Czech Republic In Europe ) జంతుప్రదర్శనశాలకు చెందిన కోతి చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని తినేసింది.
చనిపోయిన చాలా రోజుల పాటు తన శిశువు మృతదేహాన్ని మోసుకెళ్లింది. """/" /
పిల్ల కోతి( Baby Monkey ) మరణించిన తరువాత, తన బిడ్డ శవాన్ని దాదాపు రెండు రోజుల పాటు తన ఎన్‌క్లోజర్ చుట్టూ మోసుకెళ్లింది.
మృతదేహాన్ని బయటకు తీయకుండా జూ కీపర్లను( Zoo Keepers ) ఆ కోతి అడ్డుకుంది.
రెండవ రోజు ముగిసే సమయానికి, కోతి తన చనిపోయిన బిడ్డను తినడం ప్రారంభించడంతో అంతా భయపడ్డారు.
అయితే ఆ చనిపోయిన కోతి పిల్ల శవాన్ని జూ కీపర్లు తీశారు.అప్పటికే చాలా భాగాన్ని ఆ తల్లి కోతి తినేసింది.
డ్రిల్ ట్రూప్‌ను అధ్యయనం చేస్తున్న పరిశోధకులు మొత్తం సంఘటనను డాక్యుమెంట్ చేశారు.డ్రిల్ ట్రూప్‌ను అధ్యయనం చేస్తున్న పరిశోధకుల బృందం జూన్ 27న ప్రైమేట్స్ జర్నల్‌లో( Journal Of Primates ) ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ సంఘటన గురించి వివరించింది.
కోతి తన బిడ్డను తింటున్న వీడియోలను కూడా వారు పంచుకున్నారు.తన బిడ్డ మరణించిన తర్వాత దానిని రెండు రోజులు తన వద్దే ఆ కోతి ఉంచుకుందని, దానిని జూ కీపర్లు పరిశీలించడానికి వచ్చినప్పుడు అది ఒప్పుకోలేదని వారు పేరు్కొన్నారు.
తన బిడ్డ చనిపోయిందని అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు.
అంధ గాయకుడిని ఉద్దేశించి థమన్ పోస్ట్ వైరల్.. అతడిలో గొప్ప టాలెంట్ ఉందంటూ?