జాంబియా: ఫారెస్ట్ సఫారీలో షాకింగ్ ఘటన.. టూరిస్ట్‌ని చంపేసిన ఏనుగు..??

జాంబియాలో ఫారెస్ట్ సఫారీ టూర్‌లో( Safari Tour In Zambia ) ఒక విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇక్కడ జంతువులను చూసి హాయిగా ఎంజాయ్ చేయాలనుకున్న ఒక అమెరికన్ ఫిమేల్ టూరిస్ట్ ఎలిఫెంట్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది.

లివింగ్‌స్టోన్‌లోని మారంబా కల్చరల్ బ్రిడ్జి( Maramba Cultural Bridge In Livingstone ) దగ్గర ఈ ఘటన జరిగింది.

అక్కడ టూరిస్ట్‌ల జీప్ ఏనుగుల మందలో చిక్కుకుంది. """/" / మెట్రో న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారం, మృతురాలి పేరు జూలియానా గ్లే టోర్నో( Juliana Gley Torno ).

ఈ అమెరికా మహిళా ప్రయాణికురాలి జాంబియాలో గత కొద్ది రోజులుగా పర్యటిస్తోంది.అయితే సఫారీ టూర్‌లో ఆమెపై ఊహించని విధంగా ఏనుగు దాడి చేసింది.

ఆమెను ఈ అడవి జంతువు బయటకు లాగేసింది అనంతరం కాళ్లతో తొక్కేస్తూ తీవ్రంగా గాయపరిచింది.

ఈ ఘటన తరువాత, వెంటనే ఆమెను మొసీ-ఓ-టూన్యా( Mosey-o-toonya ) జాతీయ ఉద్యానవనంలోని క్లినిక్‌కు తీసుకెళ్లారు.

కానీ ఆమె ఆసుపత్రికి చేరుకునే లోపే తుది శ్వాస విడిచింది.పోలీసులు విచారణ తర్వాత ఆమెకు కుడి భుజం బ్లేడ్‌పై గాయాలు, నుదుట గాయాలు, ఎడమ పాదం ఎముక ఫ్రాక్చర్ అయ్యిందని, ఛాతీ కాస్త లోపలికి పోయి ఉందని తేల్చారు.

ఈ విషాద సంఘటన ప్రయాణికులకు ఒక పీడకల అయింది. """/" / ఆ ఏనుగు దాడిలో మరెవరూ గాయపడ్డారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

ఈ విషాద సంఘటనల నేపథ్యంలో జాంబియా అధికారులు పర్యాటకులు అడవి జంతువులను చూసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

జింబాబ్వే, బోట్స్వానా వంటి పక్కనే ఉన్న దేశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని వారు తెలిపారు.

గత ఏడాదిలో ఈ దేశాల్లో అడవి జంతువుల దాడులు పెరిగాయి.కొద్ది రోజుల క్రితం 79 ఏళ్ల గైల్ మాట్సన్( Gail Mattson ) అనే మరొక అమెరికా మహిళా ప్రయాణికురాలిపై జాంబియాలోని జాతీయ ఉద్యానవనంలో ఏనుగుల గుంపు దాడి చేసింది.

ఆ దాడిలో టూరిస్ట్ జీప్‌ను ఏనుగులు కింద పడేసి నేలపై ఒక బంతిలాగా తిప్పేసాయి.

దాని వల్ల ఆమె మరణించగా, మరో అయిదుగురు గాయపడ్డారు.

కేరళ పోలీస్ శాఖ చొరవ .. ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ హెల్ప్ లైన్