వర్ష మెడలో తాళి కట్టిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ప్రేమ ఉందని చెబుతూ?

ఈ మధ్య కాలంలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్స్ ఊహించని స్థాయిలో తగ్గిపోవడంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ నిర్వాహకులు రేటింగ్స్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ప్రోమోలో చెప్పేంత వరకు బాగానే ఉంటుందని చెప్పిన తర్వాత అసలు కంటికి కూడా కనిపించదని అన్నారు.

పోసాని కృష్ణమురళి మీ ఇద్దరి మధ్య లవ్ ఉందిగా అని ఇమ్మాన్యుయేల్ ను అడగగా అది ఆమెనే చెప్పాలని అన్నారు.

తాను అందరిముందు చెబుతున్నానని ఆ అమ్మాయి లవ్ ఉందని చెబితే ఇప్పుడే తాళి కట్టేస్తానని కామెంట్ చేశారు.

ఇమ్మాన్యుయేల్ అలా చెప్పడంతో వర్ష సిగ్గు పడ్డారు.ఆ అమ్మాయి మనస్సులో ఏముందో నాకు అనవసరం అని నీ నిజాయితీకి మాత్రం హ్యాట్సాఫ్ అని పోసాని కామెంట్ చేశారు.

ఆ తర్వాత గెటప్ శ్రీను తాళి తీసుకొచ్చి వర్షను పెళ్లి చేసుకోవాలని చెబుతూ హంగామా చేశారు.

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ వర్ష మెడలో తాళి కట్టినట్టు ప్రోమోలో చూపించారు.అయితే నిజంగా ఇమ్మాన్యుయేల్ తాళి కట్టాడో లేదో తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

నవంబర్ నెల 11వ తేదీన శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

వర్ష ఇమ్మాన్యుయేల్ లవ్ ట్రాక్ టీఆర్పీ స్టంట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ ఎక్స్ట్రా జబర్దస్త్ షో రేటింగ్ ఈ ఎపిసోడ్ తో ఏమైనా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.

సుధీర్ రష్మీ జోడీ విడిపోయిన నేపథ్యంలో ఇమ్మాన్యుయేల్ వర్ష ట్రాక్ కు ఈ షో నిర్వాహకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ జోడీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.

వర్ష ఇమ్మాన్యుయేల్ మధ్య రియల్ లైఫ్ లో ఏం లేదని పలువురు జబర్దస్త్ కమెడియన్లు చెబుతున్నారు.

కాస్కో ట్రంప్.. ‘రిపబ్లికన్స్ ఫర్ హారిస్’ ప్రారంభించిన కమలా హారిస్