సింగర్ చిత్ర ని బండ బూతులు తిట్టిన ఇళయరాజా..చివరికి ఏమైందంటే!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సింగర్స్ రావొచ్చు , పోవచ్చు కానీ కొంత మంది సింగర్స్ కి మాత్రం ప్రేక్షకులు తమ మనస్సులో చిరస్థాయిగా గుర్తించుకుంటారు.

అలాంటి సింగర్స్ లో ఒకరు చిత్ర.( Singer Chitra ) ఈమె గొంతులోని మాధుర్యానికి ఎంత అని వెలకట్టగలం.

ఆమె లాంటి సింగర్ మన తెలుగు సినిమా పరిశ్రమకి దొరకడం అనేది మనం చేసుకున్న అదృష్టం.

పురుష సింగర్స్ లో స్వర్గీయ ఎస్ పీ బాలసుబ్రమణ్యం కి( SP Balasubramanyam ) ఎంత మంచి పేరుందో, లేడీ సింగర్స్ లో చిత్ర గారికి ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.

ఇప్పటికి ఈమె పాటలు స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్ లో ప్రతీ రోజు ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

ఇప్పటి వరకు ఈమె అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 25 వేలకు పైగా పాటలను పాడింది.

ఆమె చివరి సారిగా పాడిన పాట 'అంత ఇష్టం ఏందయ్యా' సాంగ్.భీమ్లా నాయక్ లోని ఈ పాట అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.

"""/" / ఇది ఇలా ఉండగా గత కొంతకాలం క్రితం చిత్ర ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ లో చోటు చేసుకున్న కొన్ని అరుదైన సంఘటనలు గురించి చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ 'నేను ఈరోజు కెరీర్ లో ఈ స్థానం లో నిలబడ్డాను అంటే దానికి కారణం ఇళయరాజా( Ilayaraja ) గారే.

ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ కి పాటలు పాడిన తర్వాతే మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ అమ్మాయి పర్లేదు రాజా గారి దగ్గర పని చేసింది, మనం ట్రై చేద్దాం ఒకసారి అని అవకాశాలు ఇచ్చారు.

ఇళయరాజా గారి రికార్డింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఆయన కోరిన విధంగా పడకపోతే బాగా తిట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

అలా ఆయన నన్ను తిట్టడం వల్లే నన్ను నేను సరి చేసుకున్నాను, ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను' అను చెప్పుకొచ్చింది చిత్ర.

"""/" / ఇంకా ఆమె మాట్లాడుతూ 'తెలుగు లో నాకు మొట్టమొదటి పాట పాడే అవకాశం ఇచ్చింది సత్యం గారు.

ప్రళయం అనే సినిమాలో ఒక చిన్న పాట పాడాను' అంటూ చెప్పుకొచ్చింది.చిత్ర గారిలో ఉన్న అరుదైన రికార్డు ఏమిటంటే ఇప్పటి వరకు ఆమె పాడిన ప్రతీ ప్రాంతీయ భాష లో, ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టాత్మక స్టేట్ అవార్డు ని సొంతం చేసుకుంది.

ఈ రికార్డు ఎస్ పీ బాలసుబ్రమణ్యం కి కూడా లేదు.ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె విజయ్ శంకర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లాడింది.

ఈమెకి అప్పట్లో నందన అనే ఒక కూతురు కూడా ఉండేది.ఒకరోజు AR రెహ్మాన్ లైవ్ కన్సర్ట్ లో పాట పాడేందుకు వెళ్లిన చిత్ర ఒక హోటల్ రూమ్ లో దిగింది.

అక్కడ ఆమె లేని సమయం లో కూతురు నందన స్విమ్మింగ్ పూల్ కాలు జారీ పడిపోయింది.

దురదృష్టపుశాతం ఆమెని కాపాడలేకపోయారు, ఇప్పటికీ చిత్ర తన కూతురుని తల్చుకున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటుంది.

బ్రెజిల్ జాతీయ చిహ్నం ఈ కుక్కలే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!