ఈ టాలీవుడ్ స్టార్స్ ఫ్లాప్ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే బ్లాక్ బస్టర్స్ అయ్యేవా?
TeluguStop.com
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అండర్ రేటెడ్ సినిమాలు ఎన్నో ఉంటాయి.వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం అప్పట్లో సాధ్యం కాలేదు.
అయితే ఈ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఉండేవని చాలామంది భావిస్తారు.
మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే క్లాసిక్ మూవీ అనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఫిదా చేసేలా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
అయితే ఈ సినిమా రిలీజైన సమయంలో విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.
చాలామంది ఈ సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేదు.ఇప్పుడు మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పిస్తుండటం గమనార్హం.
ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.
రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరెంజ్ మూవీ రిలీజైన సమయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
"""/"/ అయితే ఈ సినిమా అండర్ రేటెడ్ మూవీ అని చాలామంది భావిస్తారు.
ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే.తారక్ నటించిన ఊసరవెల్లి సినిమా కూడా అండర్ రేటెడ్ మూవీ అని చాలామంది అనుకుంటారు.
"""/"/
ఇప్పుడు విడుదలై ఉంటే ఈ సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేసేదని చాలామంది భావిస్తున్నారు.
మహేష్ బాబు ఖలేజా, శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఐ, ప్రభాస్ సాహో సినిమాలు కూడా రిలీజైన సమయంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.
ఈ సినిమాలలో కొన్ని సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.
హలో అబ్బాయిలు.. జుట్టు పల్చబడిందా.. వర్రీ వద్దు ఇలా చేయండి!