ఈ నాలుగు సినిమాల బ్లాక్ బస్టర్ రిజల్ట్ వెనుక అసలు కథ తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఒక సినిమాను హిట్ చేస్తుంటే పది సినిమాలను ఫ్లాప్ చేస్తున్నారు.
స్టార్ హీరోల కంటే కంటెంట్ సినిమాల జయాపజయాలను డిసైడ్ చేయడం కీలక పాత్ర పోషిస్తోంది.
ఓటీటీల హవా పెరిగిన నేపథ్యంలో తమ సినిమాలు హిట్ కావడానికి హీరోలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
స్టార్ హీరోల సినిమాలను పండుగలకు షెడ్యూల్ చేయడం వెనుక కూడా అసలు రీజన్ ఇదేనని సమాచారం.
అయితే సినిమా విడుదలకు ముందే పాజిటివ్ పబ్లిసిటీ జరగాలనే ఉద్దేశంతో మేకర్స్ సినిమా రిలీజ్ కు ముందే ప్రీమియర్లు వేస్తుండటం గమనార్హం.
మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు రిలీజ్ కు ముందే ప్రీమియర్ల వల్ల ఊహించని స్థాయిలో పాజిటివ్ పబ్లిసిటీ జరగడంతో పాటు సినిమాలకు అదిరిపోయే కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.
777 చార్లీ, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలకు ఈ ప్రీమియర్ల వల్ల పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.
"""/" /
అదే సమయంలో మంచి రోజులు వచ్చాయి, థాంక్యూ సినిమాలకు మాత్రం ప్రీమియర్లు మైనస్ అయ్యాయి.
కామన్ పబ్లిక్ కు ప్రీమియర్లు ప్రదర్శిస్తుండటంతో సినిమా రిజల్ట్ ముందుగానే తెలిసిపోతుంది.రాబోయే రోజుల్లో చిన్న సినిమాల నిర్మాతలు ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే చిన్న సినిమాలు సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయి.
కథ, కథనం ఆసక్తికరంగా లేకపోతే ప్రీమియర్ల వల్ల భారీ నష్టాలు తప్పవని చెప్పవచ్చు.
"""/" /
ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల సక్సెస్ రేట్ పెరుగుతోంది.
శివరాత్రి కానుకగా విడుదలైన సినిమాలలో శ్రీదేవి శోభన్ బాబు మినహా మిగతా రెండు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.
సంతోష్ శోభన్ కు ఈ ఏడాది కలిసిరాలేదని అందువల్లే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
కథల విషయంలో, రిలీజ్ డేట్ల విషయంలో సంతోష్ శోభన్ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూ.2 కోట్ల సాయంతో బన్నీపై కోపం తగ్గినట్టేనా.. ఆ కేసు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా?