ఆ వ్యాక్సిన్ వల్లే పునీత్ రాజ్ కుమార్ మరణించారంటూ ప్రచారం.. నిజమేంటంటే?
TeluguStop.com
పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) మరణం ఫ్యాన్స్ ను ఎంతో బాధ పెట్టిన సంగతి తెలిసిందే.
రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా పునీత్ రాజ్ కుమార్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.
ఆయన రియల్ హీరో అని చాలామంది భావిస్తారు.2021 సంవత్సరం అక్టోబర్ నెల 29వ తేదీన పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు.
అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్( Covishield Vaccine ) వల్ల పునీత్ రాజ్ కుమార్ మరణించారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే కోవిషీల్డ్ సంస్థ ప్రతినిధులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెలల్లోనే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనిపిస్తాయని చాలా తక్కువమందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు.
అయితే పునీత్ రాజ్ కుమార్ వ్య్వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలల తర్వాతే మృతి చెందారని అందువల్ల ఆయన వ్యాక్సిన్ వల్ల మృతి చెందలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
కోవిషీల్డ్ మాత్రమే కాదు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్( Side Effects ) ఉంటాయి.
అయితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ మరీ ప్రాణాలు తీసే రేంజ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కరోనా వ్యాక్సిన్స్( Corona Vaccine ) గురించి ప్రజల్లో చాలామందిలో అపోహలు ఉన్నాయి.
కొన్ని వార్తల వల్ల చాలామంది ఆ అపోహలనే నిజం అని నమ్ముతుండటం గమనార్హం.
పునీత్ రాజ్ కుమార్ బ్రతికున్న సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. """/" /
పునీత్ రాజ్ కుమార్ చిన్న వయస్సులోనే మరణించడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.
పునీత్ రాజ్ కుమార్ లాంటి హీరోలు నూటికో కోటికో ఒక్కరు ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆయన మరణం తర్వాత కూడా కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మరణించినా తమ హృదయాల్లో జీవించి ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
శోభిత నాగచైతన్య ఆ పెళ్లి వార్తలలో నిజం లేదు.. రూమర్లకు చెక్ పెట్టిన టీమ్!