నాగార్జున రిజెక్ట్ చేస్తే వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమా ఏదో మీకు తెలుసా?
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్( Tollywood ) డైరెక్టర్ ముప్పలనేని శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నీ ప్రేమకై సినిమా బాగా సక్సెస్ సాధిస్తుందని నేను భావించానని కానీ ఆ సినిమా విషయంలో నా అంచనాలు తప్పాయని ముప్పలనేని శివ( Muppalaneni Shiva ) అన్నారు.
ఆ సినిమాకు కేవలం 50 డేస్ రన్ మాత్రమే వచ్చిందని ఆయన తెలిపారు.
యూట్యూబ్ లో ఇప్పటికీ ఆ సినిమాను చూస్తున్నారని పేర్కొన్నారు.నీ ప్రేమకై సినిమాకు లయను తీసుకోవాల్సి వచ్చిందని ఆమె నటించడం వల్ల సినిమాకు కమర్షియల్ రీచ్ తగ్గిందని అన్నారు.
లయ వండర్ ఫుల్ గా చేసినా ఆ సినిమా ప్రేక్షకుల మెప్పును అనుకున్న స్థాయిలో పొందలేదని చెప్పుకొచ్చారు.
సంక్రాంతి మూవీ( Sankranti Movie ) నాగార్జున గారితో చేయాలని అనుకున్నానని ముగ్గురు తమ్ముళ్లు, ఫ్యామిలీ అంటే నాగ్ ఆ సినిమాను వదులుకున్నారని ముప్పలనేని శివ కామెంట్లు చేశారు.
"""/" /
రాజా సినిమా వల్ల నాకు రీమేక్ డైరెక్టర్ అని మంచి పేరు వచ్చిందని ఆయన అన్నారు.
ఈ ఇండస్ట్రీలో మంచి పేరుతో రిటైర్ అవ్వాలని అనుకున్నానని ముప్పలనేని శివ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ సినిమాతో నాకు రీమేక్ డైరెక్టర్ గా ముద్ర పడిపోయిందని ఆయన కామెంట్లు చేశారు.
ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నాలుగు సినిమాలు మాత్రమే చేశానని ముప్పలనేని శివ అన్నారు.
"""/" /
బాపట్ల దగ్గర ఉన్న నర్సాయపాలెం స్వస్థలం అని ఆయన కామెంట్లు చేశారు.
ముప్పలనేని శివ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన డైరెక్షన్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
రాబోయే రోజుల్లో ముప్పలనేని శివ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.నాగార్జున సంక్రాంతి మూవీని రిజెక్ట్ చేయకుండా ఉండి ఉంటే ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకునేవారు.
చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?