ఆ మూవీ క్లైమాక్స్ విని భోజనం ప్లేట్ నెట్టేసిన పూరీ జగన్నాథ్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో టెంపర్ సినిమా ఒకటి కాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.

కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించడానికి క్లైమాక్స్ కారణమని చాలామంది భావిస్తారు.

వక్కంతం వంశీ అలీతో సరదాగా షోలో మాట్లాడుతూ టెంపర్ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

మొదట యాడ్ చూసి ఈటీవీలో న్యూస్ రీడర్ గా సెలెక్ట్ అయ్యానని ఆ తర్వాత ఛాన్స్ కోసం ప్రయత్నించి కళ్యాణ్ ప్రాప్తిరస్తు సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నానని వక్కంతం వంశీ పేర్కొన్నారు.

కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీ ఆడలేదని అయితే సినిమా రంగంలోనే ఉండాలని భావించి కథలు రాయడం మొదలుపెట్టానని ఆయన వెల్లడించారు.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ స్టోరీ తారక్ ను దృష్టిలో పెట్టుకుని రాశానని వక్కంతం వంశీ అన్నారు.

అయితే ఆ కథ తారక్ కు సూట్ కాదని అనిపించిందని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు.

ఆ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో తప్పులు జరిగాయని ఆయన వెల్లడించారు.తారక్ ద్వారా సురేందర్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని వక్కంతం వంశీ పేర్కొన్నారు.

పూరీ చెప్పిన టెంపర్ క్లైమాక్స్ నాకు నచ్చలేదని గంట టైమ్ అడిగి నేను క్లైమాక్స్ చెప్పగా పూరీగారు భోజనం ప్లేట్ ను పక్కన పెట్టేశారని ఆయన చెప్పుకొచ్చారు.

"""/"/ నా పేరు సూర్య మూవీలో అన్వర్ పాత్రను ఎందుకు హైలెట్ చేశారని చాలామంది అడుగుతున్నారని ఆ సినిమా కథే అన్వర్ రోల్ అని వక్కంతం వంశీ వెల్లడించారు.

ఇప్పటివరకు 12 కథలను సినిమాలుగా తీయడం జరిగిందని ఆయన వెల్లడించారు.వక్కంతం చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మానసిక రోగిపై ఉడుకు నీళ్లు పోసిన మలేషియన్ మహిళ.. ఊహించని శిక్షతో లబోదిబో..??