కృష్ణకు సూపర్ స్టార్ బిరుదు వెనుక అసలు కథ తెలిస్తే షాకవ్వాల్సిందే?

సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

అయితే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఆయన ఒకే విధంగా ఉన్నారు.తన యాక్టింగ్ ద్వారా కృష్ణకు ఎంతోమంది ఫ్యాన్స్ గా మారారు.

ప్రముఖ సినీ పత్రికలలో ఒకటైన శివరంజని తెలుగు సినిమాలలో సూపర్ స్టార్ బిరుదు ఎవరికి కరెక్ట్ అని ఓటింగ్ నిర్వహించింది.

అయితే ఆ ఓటింగ్ లో కృష్ణకు తిరుగులేని మెజార్టీ వచ్చింది.అప్పటినుంచి కృష్ణ ప్రేక్షకులకు సూపర్ స్టార్ అయ్యారు.

కృష్ణ భౌతికకాయాన్ని చూసి పలువురు సినీ సెలబ్రిటీలు కన్నీరుమున్నీరవుతున్నారు.ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కృష్ణ పార్థివదేహం దగ్గరకు వచ్చి సోదరా సోదరా అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

ఆ తర్వాత మోహన్ బాబు మహేష్ బాబును హత్తుకుని ధైర్యం చెప్పారు.కృష్ణ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన కామెంట్లు చేశారు.

కృష్ణ హీరోగా మోహన్ బాబు విలన్ గా ఎక్కువ సంఖ్యలో సినిమా తెరకెక్కగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.

ఐదు సినిమాలలో వీళ్లిద్దరూ కలిసి నటించారు.సినిమాలతో సంబంధం లేకుండా వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది.

తొలి సినిమా నుంచే కృష్ణ ఎన్నో సాహసాలు చేసి నటుడిగా అభిమానులకు అంతకంతకూ దగ్గరయ్యారు.

కొన్ని సందర్భాల్లో కృష్ణ నిర్ణయాలపై ఇతరుల నుంచి విమర్శలు వచ్చాయి. """/"/ ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందడుగు వేసి కృష్ణ ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు.

గూఢఛారి 116 తెలుగులో వచ్చిన తొలి స్పై సినిమా కాగా కొన్ని విషయాలకు సంబంధించి కృష్ణ మొండిగా ముందుకెళ్లేవారు.

ప్రయోగాలతో సంతృప్తి చెందని కృష్ణ ప్రతి సందర్భంలో కొత్తదనం దిశగా అడుగులు వేసేవారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే14, మంగళవారం 2024