సుడిగాలి సుధీర్ కెరీర్ నాశనం కావడానికి ఆ స్టార్ యాంకర్ కారణమా?
TeluguStop.com
బుల్లితెర షోలు చూసే ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈటీవీలో సక్సెస్ సాధించిన మెజారిటీ షోల సక్సెస్ వెనుక సుడిగాలి సుధీర్ పాత్ర ఉంది.
సుధీర్ రష్మీ జోడీకి మరే జోడీకి లేని స్థాయిలో గుర్తింపు, పాపులారిటీ దక్కిందనే సంగతి తెలిసిందే.
అయితే ఈటీవీకి గుడ్ బై చెప్పిన తర్వాత సుధీర్ కెరీర్ పుంజుకుంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
స్టార్ మా ఛానల్ లో ఒక సింగింగ్ షో కోసం పని చేసిన సుధీర్ ఆ సింగింగ్ షో తర్వాత ఛానల్ కు దూరమయ్యారు.
సుధీర్ మెయిన్ లీడ్ గా రెండు ఈవెంట్లు ప్రసారం కాగా ఈ ఈవెంట్లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం ఒక కామెడీ షో చేస్తున్నారు.
కామెడీ స్టాక్ ఎక్చేంజ్ పేరుతో ఈ షో ప్రసారమవుతోంది. """/"/
అయితే ఈ షో కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందో లేదో ఎవరూ చెప్పలేరు.
ఈ షో కూడా ఫ్లాప్ అయితే సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సుడిగాలి సుధీర్ ఈటీవీ ఛానల్ కు గుడ్ బై చెప్పడం వెనుక యాంకర్ ఓంకార్ ఉన్నారని తెలుస్తోంది.
యాంకర్ ఓంకార్ సూచనలే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ దారుణమైన పరిస్థితికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ కామెంట్ల విషయంలో సుడిగాలి సుధీర్, ఓంకార్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
సుడిగాలి సుధీర్ రెమ్యునరేషన్ పెరుగుతుందని ఈటీవీ ఛానల్ ను వదిలి తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే సుడిగాలి సుధీర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఒకటి రెండు ప్లాప్ లు వచ్చిన రామ్ చరణ్ కి ఇబ్బంది లేదా..?