సమంత కంటే శాకుంతలం హీరో అంత చిన్నవాడా.. ఆ హీరో బ్యాగ్రౌండ్ ఇదే!
TeluguStop.com
శాకుంతలం( Shaakuntalam ) సినిమా రిలీజ్ సమయం దగ్గర పడే కొద్దీ సమంత అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
శాకుంతలం ప్రీమియర్ షోలకు నెగిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. """/" / అయితే సమంత కంటే దేవ్ మోహన్ ( Dev Mohan )ఐదేళ్ల చిన్నవాడు కావడం గమనార్హం.
దేవ్ మోహన్ ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగిగా పని చేశారు.కేరళలోని త్రిశూర్ దేవ్ మోహన్ స్వస్థలం కావడం గమనార్హం.
1992 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన దేవ్ మోహన్ జన్మించారు.ప్రతిరోజూ జిమ్ కు వెళ్లడం దేవ్ మోహన్ కు అలవాటుగా ఉండేది.
2016లో మిస్టర్ ఇండియా పోటీలలో పాల్గొని ఫైనలిస్ట్ గా ఆయన ఎంపికయ్యారు. """/" /
అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దేవ్ మోహన్ అడిషన్ కు వెళ్లి సెలెక్ట్ అయ్యాడు.
అయితే అతని తొలి సినిమా ఓటీటీలో విడుదలై నిరాశను మిగిల్చింది.సూఫియం సుజాతయుం(Sufiyum Sujatayum ) సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న దేవ్ మోహన్ ఆ సినిమా వల్లే శాకుంతలం సినిమాలో ఎంపికయ్యారు.
మొదట ఈ సినిమా కోసం దుల్కర్ సల్మాన్ ను పరిశీలించగా వేర్వేరు కారణాల వల్ల దేవ్ మోహన్ సెలెక్ట్ అయ్యారు.
"""/" /
సమంత నుంచి తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని దేవ్ మోహన్ అన్నారు.
రష్మికతో కలిసి దేవ్ మోహన్ ప్రస్తుతం రెయిన్ బో అనే సినిమాలో నటిస్తున్నారు.
శాకుంతలం సినిమాతో దేవ్ మోహన్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది.
ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.దేవ్ మోహన్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
నా భర్త అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!