అభిమానులకు సీనియర్ ఎన్టీఆర్ దేవుడు కావడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు కావాలా?

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) ను ఆయన అభిమానులు దేవుడిలా కొలుస్తారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ నామస్మరణతో సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల వల్ల ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది.

సీనియర్ ఎన్టీఆర్ కు తన సినీ కెరీర్ లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.

అయితే ఆయన ఎప్పుడూ కెరీర్ పరంగా వెనుకడుగు వేయలేదు. """/" / ఎంత పెద్ద సమస్య ఎదురైనా, ఎన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఆయన వెనక్కు తగ్గలేదు.

మన దేశం( Mana Desam Movie ) సినిమా ఎన్టీఆర్ తొలి సినిమా కాగా పోలీస్ డ్రెస్ వేసుకున్న ఎన్టీఆర్ నిజంగానే లాఠీఛార్జ్ చేశారు.

పల్లెటూరి గిత్త షూట్ సమయంలో ఎద్దు కొమ్ములు వంచడానికి ప్రయత్నించి చేయి విరిగినా ఆయన అలాంటి సాహసాలు చేసే విషయంలో వెనక్కు తగ్గలేదు.

మాయాబజార్( Mayabazar Movie ) లో కృష్ణుడి రోల్ పోషించిన ఎన్టీఆర్ నిజమైన కృష్ణుడు ఇలానే ఉంటాడేమో అనే అభిప్రాయం కలిగించారు.

డబ్బులు పోతాయని తెలిసినా కొన్ని మంచి సినిమాలను సొంతంగా నిర్మించి ఎన్టీఆర్ తన అభిరుచిని చాటుకున్నారు.

కేవీ రెడ్డికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలిసి తన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఎన్టీఆర్ ఇచ్చారు.

ఈ సినిమాకు అన్ని పనులు ఎన్టీఆర్ చేసినా కేవీ రెడ్డి పేరు వేశారు.

ఎలాంటి పాత్రలో నటించినా ఎన్టీఆర్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు. """/" / ప్రజలకు కష్టాలు ఎదురైన సమయంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఎన్టీఆర్ ప్రజలను ఆదుకున్నారు.

వరుస విజయాలతో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ( Politics )వచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు.

రాజకీయాల్లో, సినిమాల్లో తనదైన ముద్ర వేశారు.అన్నగారిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.

ఆయన చేసిన మంచి పనులే ప్రజల్లో ఆయనను దేవుడిని చేశాయి.అభిమానులకు ఎన్టీఆర్ దేవుడు కావడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని చెప్పవచ్చు.

హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనా..ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలివే!