Sampath Vinay : షణ్ముఖ్ సోదరుడు వాళ్లను కూడా మోసం చేశాడా.. బాధితులు చాలామందే అంటూ?
TeluguStop.com
యూట్యూబ్ ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్( Shanmukh Jaswanth ) ఒకరు.
అయితే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్( Sampath Vinay ) పై ఒక అమ్మాయి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అయితే సంపత్ వినయ్ గురించి మరిన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.కొంతమంది బాధితులు సంపత్ వినయ్ తమను కూడా మోసం చేశాడంటూ ఆరోపణలు చేస్తుండగా ఆ ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
"""/" /
సంపత్ తన ఎంబీఏ క్లాస్ మేట్ దగ్గర 2016 సంవత్సరంలో థిక్ షేక్ ఫ్రాంఛైజీలో పెట్టుబడులు పెడదామని చెప్పి 20 లక్షల రూపాయలు తీసుకుని నెలకు కేవలం 7,000 రూపాయలు లాభం చూపించాడట.
తన పెట్టుబడి వెనక్కు ఇవ్వాలని ఆ యువతి కోరగా ఆమె నంబర్ ను సంపత్ బ్లాక్ చేశాడట.
ముంబైలో మరో యువతిని సంపత్ వినయ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
"""/" /
సంపత్ వినయ్ బారిన పడి మోసపోయిన అమ్మయిలు వెలుగులోకి వస్తుండగా సంపత్ వినయ్ పై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోంది.
సంపత్ వినయ్ కెరీర్ కు ఈ కేసు వల్ల ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
డాక్టర్ మౌనిక సంపత్ వినయ్ మోసం చేశాడని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో సంపత్ వినయ్ మోసాలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం.
సంపత్ వినయ్ కు ఇప్పటివరకు బెయిల్ కూడా లభించలేదు.డాక్టర్ మౌనిక( Dr Mounika ) సైతం మీడియాకు దూరంగా ఉంటున్నారు.
రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.ఈ కేసుకు సంబంధించి మౌనికకు న్యాయం జరగాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
సంపత్ వినయ్ కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాల గురించి తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇన్నాళ్లకు దొరికేశాడు.. మన ఫోన్లో వినిపించే వాయిస్ ఇతనిదే!