ప్రాజెక్ట్ కే కామిక్ వెర్షన్ లీకైందిగా.. ఆ ప్రజలను కాపాడే దేవుడే ప్రభాస్ అంటూ?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే( Project K ) సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ ప్రభాస్ అభిమానులకు తెగ నచ్చేస్తోంది.

ప్రాజెక్ట్ కే పోస్టర్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించగా గ్లింప్స్ తో విమర్శలకు ప్రభాస్( Prabhas ) చెక్ పెట్టడం ఖాయమని ఇందుకు సంబంధించి కామెంట్లు వినిపిస్తున్నాయి.

'ప్రాజెక్ట్ కె' కామిక్ ఆర్ట్​ వెర్షన్ రెండు పేజీలు లీక్ కావడం హాట్ టాపిక్ అవుతుంది.

ఈ సినిమాలో కమల్( Kamal ) రాక్షసుడిగా కనిపిస్తాడని ప్రభాస్ దేవుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

కలియుగం చివర్లో ఒక రాక్షసుడు రాక్షన పాలన సాగిస్తూ ఉంటాడని ఆ సమయంలో ప్రజల కష్టాలను తీర్చడానికి దేవుడిగా ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని సమాచారం అందుతోంది.

ప్రాజెక్ట్ కే విడుదలకు ముందు విడుదల తర్వాత సంచలనాలను సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ కాగా ప్రాజెక్ట్ కే స్టోరీ లైన్ రొటీన్ గా ఉన్నా కథనం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

"""/" / ప్రాజెక్ట్ కే మూవీ గ్లింప్స్ తో ఈ సినిమా విషయంలో నెలకొన్న అనుమానాలు అన్నీ పటాపంచలు అవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్ట్ కే సినిమా ప్రభాస్ అభిమానుల అంచనాలను మించి ఉండనుందని కథనం ఎంతో అద్భుతంగా ఉండటం వల్లే నాగ్ అశ్విన్ ( Nag Ashwin )ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని భోగట్టా.

భారతీయ సినీ చరిత్రలోనే ప్రాజెక్ట్ కే సినిమా మైలురాయిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ప్రాజెక్ట్ కే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎలా ప్లాన్ చేశారో చూడాలి.

దిగ్గజ నటులు నటించడం వల్లే ఈ సినిమాపై ఈ స్థాయిలో అంచనాలను పెరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్ట్ కే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

డార్క్ నెక్ వారంలో వైట్ గా బ్రైట్ గా మారాలంటే ఈ రెమెడీని తప్పక ట్రై చేయండి!