ఆస్కార్ గెలిచిన భారతీయులు వీళ్లే.. తొలి వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.

ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ ఆస్కార్ ను సొంతం చేసుకుంటే తమ కల నెరవేరుతుందని భావిస్తారు.

ఈ నెల 12వ తేదీన 95వ ఆస్కార్ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఆస్కార్ చేరితే తెలుగు వాళ్లు సైతం గర్వంగా ఫీలయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

భారత తొలి ఆస్కార్ విజేత ఎవరనే ప్రశ్నకు భాను అథైయా పేరు సమాధానంగా వినిపిస్తుంది.

1982 సంవత్సరంలో విడుదలైన గాంధీ సినిమాకు 1983లో జరిగిన 55వ ఆస్కార్ వేడుకలలో ఈ పురస్కారం అందించడం జరిగింది.

మహాత్మగాంధీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ఈ అవార్డును సొంతం చేసుకుంది.

భాను అథైయా గాంధీ సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేయడం వల్ల ఈ అవార్డ్ పొందడం సాధ్యమైంది.

"""/" / భాను అథైయా పూర్తి పేరు భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యయ్ అని సమాచారం.

1956లో కెరీర్ ను మొదలుపెట్టిన భాను అతైయా 100కు పైగా సినిమాలకు పని చేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

భారతదేశంలోని గొప్ప దర్శకులలో ఒకరైన సత్యజిత్ రే 1992 సంవత్సరంలో ఆస్కార్ ను పొందారు.

2009 సంవత్సరంలో ముగ్గురు భారతీయులకు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. """/" / స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు రసూల్ ఆస్కార్ ను సొంతం చేసుకున్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గుల్జార్ కు సైతం ఈ అవార్డ్ వచ్చింది.

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు రెండు విభాగాలలో ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ వచ్చింది.

గునీత్ మోన్గా అనే ప్రొడ్యూసర్ నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డ్ సొంతం చేసుకుంది.

ఏంది భయ్యా అది.. ఆవునో, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమికొట్టావ్‌గా!