ఆ సినిమాతో మహేష్ పని గోవిందా అన్నారు.. కట్ చేస్తే నాలుగు రెట్ల లాభం.. ఏ మూవీ అంటే?

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది.

వరుసగా రెండు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపరు.

ఒకవేళ స్టార్ హీరోలు నటించినా ఆ సినిమాలకు కొన్నిసార్లు బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు అలాంటి సినిమాలే రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టిస్తుంటాయి.

అలా మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒక్కడు సినిమా( Okkadu Movie ) ఒకటి.

ఎమ్మెస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.పుల్లెల గోపీచంద్ జీవితంలోని విశేషాల ఆధారంగా గుణశేఖర్( Gunasekhar ) ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.

ఈ సినిమాకు మొదట అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ను పరిశీలించారు.

"""/" / ఆ తర్వాత కబడ్డీ( Kabaddi ) అనే మరో టైటిల్ ను కూడా పరిశీలించడం జరిగింది.

మేకర్స్ ఈ సినిమాకు చివరకు ఒక్కడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమా మహేష్ పని గోవిందా అని కామెంట్ చేసిన వాళ్లే సినిమా విడుదలైన తర్వాత సినిమా సాధించిన ఫలితాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారు.

ఈ సినిమాలోని చార్మినార్ సెట్ కోసం ఒకింత ఎక్కువ మొత్తమే ఖర్చు చేయడం గమనార్హం.

"""/" / 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 39 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

మహేష్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఒక్కడు సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో సైతం మహేష్ బాబుకు మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా తర్వాత మహేష్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మహా నటికి నివాళులు అర్పించిన అనసూయ.. భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!