ఆ వ్యక్తితో డేటింగ్ లో ఉన్న మాధవీలత.. పెళ్లి శుభవార్త అప్పుడేనంటూ?

నచ్చావులే సినిమా( Nachavule )తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పరిమితంగా సినిమాలలో నటించినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో మాధవీలత ఒకరు.

చిన్న సినిమాలలో ఎక్కువగా నటించిన మాధవీలత వయస్సు ప్రస్తుతం 34 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ప్రముఖ నటి అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.తన డేటింగ్ రిలేషన్ గురించి మాధవీలత( Madhavilatha ) తాజాగా చెప్పుకొచ్చారు.

నేను ఒక వ్యక్తిని కలిశానని మొదట అతనిని అర్థం చేసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత రెండువైపులా పేరెంట్స్ నుంచి అనుమతి పొందాలని ఆమె కామెంట్లు చేశారు.

ఇది అంత త్వరగా జరిగే పని అయితే కాదని మరో సంవత్సరం సమయం పట్టే అవకాశం అయితే ఉందని మాధవీలత తెలిపారు.

ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతానని మాధవీలత కామెంట్లు చేశారు.

"""/" / పెళ్లి డేట్ గురించి మాత్రం నన్ను అస్సలు అడగొద్దని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ వ్యక్తి తెలుగు వ్యక్తి మాత్రం కాదని మాధవీలత స్పష్టం చేశారు.నా నమ్మకాలను ఎవరైతే గౌరవిస్తారో అలాంటి వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటానని మాధవీలత అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అని మాధవీలత క్లారిటీ ఇచ్చారు.మాధవీలత మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

"""/" / గత ఎన్నికల్లో బీజేపీ( BJP ) తరపున పోటీ చేసిన మాధవీలత 2018 సంవత్సరంలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

మాధవీలత పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.త్వరలో మాధవీలత పెళ్లి, పెళ్లి కొడుకు, ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మాధవీలత తెలుగు సినిమాలతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్23, ఆదివారం 2024