ఆ హీరోను చెట్టుకు కట్టించి కొట్టారట.. అంత దారుణంగా అవమానించారా?

మోడ్రన్ థియేటర్స్ అనే ఓ పెద్ద సంస్థ ఒకప్పుడు సేలంలో ఉండేది.మొట్టమొదట 100 సినిమాలు ఒకే బ్యానర్‌పై తీసిన సంస్థ అది.

దీని నిర్మాత టి.ఆర్.

సుందరం.సినిమా పరిశ్రమలో ఆయనకు తెలియని విషయమంటూ లేదనే చెప్పొచ్చు.

ఆయన తమిళంలో సినిమా నిర్మిస్తున్నారంటే అందరూ చాలా జాగ్రత్తగా నడుచుకునేవారు.టి.

ఆర్.సుందరం గారికి క్రమశిక్షణ పాటించడం అనేది ముఖ్యమైనదిగా ఉండేది.

అనుకున్న సమయానికి షూటింగ్‌కి జరగాలి.కాల్షీట్లు ఇచ్చినదాని ప్రకారం ఆర్టిస్టులు అటెండ్ కావాలి.

అనే విషయాల్లో ఆయన చాలా కచ్చితంగా ఉండేవారు.ఇదిలా ఉండగా.

త్యాగరాజ భాగవతార్ అనే తమిళంలో పెద్ద నటుడు ఒకసారి ఆయన డేట్స్ ఇచ్చిన ప్రకారం షూటింగ్‌కి రాకుండా.

రెండు రోజుల తర్వాత వస్తే.ఆయన్ని చెట్టుకి కట్టేసి కొట్టారట.

అప్పట్లో దీన్ని అందరూ వింతగా చెప్పుకునేవారు.అంత కఠినంగా నిర్మాత సుందరం నడుచుకునేవారని సమాచారం.

కొందరు మాత్రం ఆయన వెనకాల నవ్వుకునే వారట.అంత కచ్చితంగా లేకపోతే వాళ్లు రెచ్చిపోతారు.

అని ఆయన వారట.ఒకసారి సినిమా హీరోలు బుక్ అయ్యాక.

ఇక వాళ్లు ఏం చేసినా మనం ఏం చేయలేమని, అందుకే అత్యంత కట్టుదిట్టంగా ఉండాలని ఆయన చెప్తుండేవారట.

"""/"/ ఆయనోసారి తెలుగులో సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామని అనే సినిమాను చేసేందుకు సన్నాహాలు చేశారు.

ఆ చిత్రానికి జగ్గయ్య గారిని హీరోగా అనుకున్నారు.ఆ నటుడికి పొగ తాగే అలవాటు ఉండేదట.

అంతకు ముందే షూటింగ్ స్పాట్‌లో పొగ తాగరాదు అనే బోర్డును కూడా సుందరం ఏర్పాటు చేశారట.

అప్పటికీ జగ్గయ్య తన అలవాటును మార్చుకోపోయే సరికి.సుందరం గారే నేరుగా చూసి ఆయన్ని వెంటనే అతనికి సెటిల్‌మెంట్ చేసి.

ఆ సినిమా నుంచి హీరోగా తీసివేశారట.అప్పటివరకూ ఆయన తీసిన రీల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి, కాంతారావును హీరోగా తీసుకున్నారట.

సుందరం గారి వ్యాపార దక్షత అంటే అంత కఠినంగా ఉండేదని ఇప్పటికీ పలువురు చెప్పుకుంటూ ఉంటారని సమాచారం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు మచ్చలు పోయి ముఖం తెల్లగా మెరుస్తుంది!