రెండేళ్లు పిచ్చికుక్కలా తిరిగానన్న ఆర్పీ.. పెళ్లి ఆరోజే అని చెబుతూ?
TeluguStop.com
జబర్దస్త్ షో (Jabardasth Show)ద్వారా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపును సొంతం చేసుకున్న ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ లను ప్రముఖ ఏరియాలలో ఓపెన్ చేస్తూ ఊహించని స్థాయిలో లాభాలను అందుకుంటున్నారు.
తన బ్రాండ్ ఇమేజ్, పబ్లిసిటీతో ఆర్పీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
ఖరీదు కొంచెం ఎక్కువైనా ఆర్పీ చేపల పులుసు తినడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు.
కిర్రాక్ ఆర్పీ (Kirrak RP)తాజాగా అమీర్ పేట్ లో మూడో బ్రాంచ్ ను ఓపెన్ చేయగా ఈ మూడో బ్రాంచ్ కు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
సీనియర్ నటులలో ఒకరైన శ్రీకాంత్ చేతుల మీదుగా అమీర్ పేట్ బ్రాంచ్ ఓపెన్ అయింది.
తాజాగా ఆర్పీ మాట్లాడుతూ కస్టమర్ల సంతృప్తి తనకు ముఖ్యమని వ్యాపారంలో లాభాలు రాకపోయినా తనకు పరవాలేదని ఆయన కామెంట్లు చేశారు.
త్వరలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రాంఛైజీలను మొదలుపెడతానని ఆర్పీ పేర్కొన్నారు. """/" /
అదే సమయంలో తన పెళ్లి గురించి, పెళ్లి తేదీ గురించి ఆర్పీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
పెళ్లి విషయంలో నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.ప్రేమ కోసం నేను రెండు సంవత్సరాలు పిచ్చికుక్కలా తిరిగానని కిర్రాక్ ఆర్పీ వెల్లడించారు.
నా మంచితనాన్ని చూసి వాళ్ల పేరెంట్స్ ఓకే చెప్పారని ఆయన పేర్కొన్నారు. """/" /
ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పెలా అవుతుందని కిర్రాక్ ఆర్పీ వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
లక్ష్మీ ప్రసన్న(Lakshmi Prasanna) మాట్లాడుతూ ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో కిర్రాక్ ఆర్పీ గెస్ట్ గా వచ్చారని ఆ తర్వాత మా అమ్మ నంబర్ తీసుకుని ఫ్యామిలీని ఒప్పించారని తెలిపారు.
ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒడియా అబ్బాయిని పెళ్లాడిన అమెరికన్ వనిత.. ఆమె జీవితం ఎలా మారిందో చూడండి!