కల్కి మూవీలో కృష్ణుడి రోల్ ను చరణ్, ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారా.. అసలు నిజాలివే!
TeluguStop.com
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైతే ఆ సినిమా చుట్టూ ఎన్నో రూమర్లు పుట్టుకొస్తాయి.
కొన్ని రూమర్లు అయితే నిజమైన వార్తల కంటే ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంటాయి.కల్కి ( Kalki )మూవీలో కృష్ణుడి రోల్ ను చరణ్, ఎన్టీఆర్( Charan, NTR ) మిస్ చేసుకున్నారని అందువల్లే సినిమాలో కృష్ణుడి పాత్ర ఫేస్ కనిపించకుండా చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.సాధ్యమైతే కల్కి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) ను ఏఐ టెక్నాలజీతో చూపించాలని భావించామని అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.
ఒకవేళ సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించి ఉంటే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండేవి కావని చెప్పవచ్చు.
సీనియర్ ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
"""/" /
కల్కి సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలతో అదిరిపోయిందని కొన్ని ట్విస్టులను అస్సలు ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
3 గంటల నిడివితో తెరకెక్కి ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమా కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కల్కి సినిమా ఫ్యాన్స్ ఆలోచనలను, అంచనాలను మించి ఉండటం గమనార్హం. """/" /
కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది.
కల్కి సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కల్కి 2898 ఏడీ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్స్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
కల్కి 2898 ఏడీ మూవీ భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
కండరాల బలహీనతకు కారణాలేంటి.. ఈ సమస్యను ఎలా అధిగమించాలి?