ఫ్రీ ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం ఆ పని చేసిన రాశీఖన్నా.. దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్లిమ్ గా ఉన్న హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు.

అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం బొద్దుగా ఉన్నా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్లలో రాశిఖన్నా ( Raashi Khanna ) ముందువరసలో ఉంటారు.

అయితే ఈ బ్యూటీ సినిమాల్లోకి రావడం వెనుక జరిగిన ఘటనల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న ఈ నటి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతున్నారు.

రాశీఖన్నా సొంతూరు ఢిల్లీ కాగా గతంలో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బరువు తగ్గారు.

రాశిఖన్నా కాలేజ్ టాపర్ అనే విషయం ఆమె అభిమానులలో చాలామందికి తెలియదు.సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ లో సెకండరీ స్కూలింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ లేడీ శ్రీరామ్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చదివారు.

"""/" / సింగర్ కావాలని అనుకున్న రాశీఖన్నా మ్యూజిక్ లో శిక్షణ కూడా తీసుకున్నారు.

అయితే అనుకోకుండా దిగిన ఒక సెల్ఫీ ( Selfie ) వల్ల ఆమె జాతకం మారిపోయింది.

షాపింగ్ మాల్ లో ఫ్రీగా వచ్చే ఫెయిర్ నెస్ క్రీమ్( Fairness Cream ) కోసం సెల్ఫీ దిగగా ఆ సెల్ఫీ వల్ల ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రావడం గమనార్హం.

రాశిఖన్నా పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. """/" / సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లలో రాశిఖన్నా ఒకరు.

రాశీఖన్నాకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాశిఖన్నాకు స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు వస్తే ఆమెకు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

రాశీఖన్నా జాగ్రత్తగా అడుగులు వేయాలని అభిమానులు భావిస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ 4 సినిమాలు చాలా స్పెషల్ గా నిలిచాయా..?