మేస్త్రీ కొడుకుగా పుట్టాడు.. అసామాన్యుడిగా ఎదిగాడు.. గద్దర్ ప్రస్థానం గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రజా గాయకుడు గద్దర్( Gaddar ) మరణం ఆయన అభిమానులను ఎంతగానో బాధపెట్టిన సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా గద్దర్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు కాగా 1949 సంవత్సరంలో మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ లో ఆయన జన్మించారు.

తన ఆటపాటలతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించిన గద్దర్ మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

"""/" / తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వాళ్లకు గద్దర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

మేస్త్రీ కొడుకుగా పుట్టిన గద్దర్ అసామాన్యుడిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.గతంలో ఒక ఇంటర్వ్యూలో గద్దర్ మాట్లాడుతూ నాది మెదక్ లోని తూఫ్రాన్ అని గుడి, బడితో ఊరు కళకళలాడుతుండేదని గద్దర్ పేర్కొన్నారు.

మా నాన్న శేషయ్య మేస్త్రీగా పని చేసేవారని ఆయన చెప్పుకొచ్చారు.యూపీలో నాన్న ఎక్కువగా పని చేశారని అంబేద్కర్ ను నాన్న దగ్గరనుంచి చూశారని గద్దర్ అన్నారు.

అంబేద్కర్ ప్రభావంతో నాన్న మమ్మల్ని స్కూల్ కు పంపాడని గద్దర్ తెలిపారు.ఏడాదిలో నెలరోజుల కంటే ఎక్కువ రోజులు నాన్న నాన్న ఊళ్లో ఉండేవారు కాదని ఆయన చెప్పుకొచ్చారు.

మా అమ్మను లచ్చమ్మ అని, మా నాన్నను బావ అని పిలిచేవారని గద్దర్ తెలిపారు.

అమ్మ చేస్తున్న పని మీద మోకాళ్ల మట్టుకు బురదలో అడుగేసి పాట రాశానని గద్దర్ పేర్కొన్నారు.

"""/" / నేను ఉద్యమంలోకి వెళ్లిన సమయంలో అమ్మ "బిడ్డా నువ్వు పోరాడాలనుకుంటున్నది వెయ్యి కాళ్ల జెర్రితో.

నువ్వు చూస్తే బక్కపలచనోడివి" అని చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమ్రోగుతాయని గద్దర్ పేర్కొన్నారు.

చెత్తకుప్పలు, పెంటకుప్పలు మాకు ఇరుగూపొరుగు అని అందరి పొలాలకు నీరు అందిన తర్వాతే మా పొలాలకు నీరు అని గద్దర్ తెలిపారు.

మేము దొరల పొలాలకు కూలి పనులకు వెళ్లేవాళ్లమని గద్దర్ చెప్పుకొచ్చారు.ఉస్మానియా యూనివర్సిటీలో</em( Osmania University ) బీటెక్ చదువుతున్న సమయంలో ఉద్యమంలో చేరానని ఉద్యమం పేరుతో వందల ఊళ్లు తిరిగి అడవిలో బ్రతికానని గద్దర్ కామెంట్లు చేశారు.

అలా గుమ్మడి విఠల్ రావు గద్దర్ గా మారిపోయాడని ఆయన తెలిపారు.నేను అజ్ఞాతంలో ఉన్న సమయంలో అమ్మను చూడటానికి మారు వేషంలో వెళ్లేవాడినని గద్దర్ అన్నారు.

అమ్మ చనిపోయిన సమయంలో, చిన్న కొడుకు చనిపోయిన సమయంలో ఊరికి వెళ్లాను కానీ అక్కడ ఉండలేదని గద్దర్ పేర్కొన్నారు.

2008 సంవత్సరంలో 60 ఏళ్లు నిండినప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లి ఆరు నెలలు ఉన్నానని గద్దర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమాలలో( Telangana Movement ) గద్దర్ ప్రత్యేకంగా నిలిచారు.తన ఊరిపై ఎంతో ప్రేమ ఉన్న గద్దర్ తూఫ్రాన్ చెరువు ద్వారా 1000 ఎకరాలకు సాగునీరు అందేలా చేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ భావించగా అంతలోనే ఇలా జరగడం గమనార్హం.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?