సాయితేజ్, సతీష్ గొడవలో ఇన్ని ట్విస్టులా.. ఇద్దరి స్నేహంలో నిప్పులు పోసింది వాళ్లేనా?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ ( Saitej ) ఎప్పుడూ కూల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

ఈ టాలెంటెడ్ హీరో వివాదాలకు సైతం దూరంగా ఉంటారు.అయితే మేనేజర్ తో గొడవ ద్వారా సాయితేజ్ వార్తల్లో నిలిచారు.

బ్రో మూవీ( Bro Movie ) షూటింగ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సాయితేజ్ నటించిన విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

అయితే సాయితేజ్, మేనేజర్ సతీష్( Manager Satish ) అన్నాదమ్ములలా ఉండేవారు.అయితే బ్రో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరో వ్యక్తికి సాయితేజ్ అప్పగించడంతో సమస్యమొదలైంది.

సతీష్ కు, ఆ వ్యక్తికి పడదని అందుకే సాయితేజ్ పై సతీష్ ఫైర్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

"""/" / సాయితేజ్ విజయాలకు తనే కారణమనేలా సతీష్ మాట్లాడాడని సమాచారం.నేను లేకపోతే నీకింత సక్సెస్ వచ్చేది కాదని సతీష్ సాయితేజ్ తో కామెంట్ చేశారని బోగట్టా.

నేను వెళ్లిపోతే నీకు ఎలా విజయం వస్తుందో చూస్తా అంటూ సతీష్ సాయితేజ్ దగ్గర జాబ్ మానేశారని సమాచారం.

సతీష్ కెరీర్ తొలినాళ్లలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారని సాయితేజ్ పై అభిమానంతొ ఆ ఉద్యోగం మానేసి మేనేజర్ అయ్యారని తెలుస్తోంది.

"""/" / సాయితేజ్ సైతం మేనేజర్ వెళ్లిపోతానని చెప్పగానే వెళ్లిపోవాలని చెప్పారని మొహం కూడా చూపించొద్దని కామెంట్ చేశారని సమాచారం.

సాయితేజ్ సతీష్ తమ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదం గురించి మెగా హీరో సాయితేజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?