టైటిల్ నచ్చి సినిమాకు ఓకే చెప్పిన బాలయ్య.. కట్ చేస్తే డిజాస్టర్.. ఏ సినిమా అంటే?

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) సక్సెస్ ఫెయిల్యూర్స్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగించిన హీరోలలో ఒకరు.

2004 సంవత్సరంలో విడుదలైన లక్ష్మీ నరసింహ తర్వాత బాలయ్య నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

కథల ఎంపికలో చేసిన పొరపాట్లు, దర్శకుల ఎంపికలో చేసిన తప్పుల వల్ల బాలయ్య కొంతకాలం పాటు సినిమాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వరుస ఫ్లాపులు బాలయ్యతో సినిమాలు తీసిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.అయితే ఈ ఫ్లాప్ సినిమాలలో బాలయ్య టైటిల్ నచ్చి ఓకే చేసిన సినిమా కూడా ఒకటి ఉంది.

ఆ సినిమా ఒక్క మగాడు( Okka Magaadu ) కావడం గమనార్హం.2008 సంవత్సరం జనవరి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలోని ఒక పాత్రలో బాలయ్య గెటప్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం కావడం గమనార్హం.

భారతీయుడు సినిమాను కాపీ కొట్టి ఈ సినిమా తీసినట్టు ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

"""/" / ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా అనుష్క సైతం ఒక సందర్భంలో తాను నటించిన సినిమాలలో నచ్చని సినిమా ఒక్క మగాడు అని చెప్పుకొచ్చారు.

ఒక్క మగాడు సినిమాలో నమ్మశక్యం కాని సీన్లు ఎక్కువగా ఉండగా ఆ సీన్లు కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

వైవీఎస్ చౌదరి సినీ కెరీర్ కు ఈ సినిమా చేసిన డ్యామేజ్ అంతాఇంతా కాదనే సంగతి తెలిసిందే.

"""/" / సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన వైవీఎస్ చౌదరి హరికృష్ణతో( Harikrishna ) తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కాగా బాలయ్యకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయారనే సంగతి తెలిసిందే.

ఒక్క మగాడు సినిమా బాలయ్య అభిమానులకు సైతం నచ్చలేదు.ఈ సినిమా తర్వాత బాలయ్య అనుష్క కాంబినేషన్ లో సినిమా రాలేదు.

ఇదేక్కడికి ట్విస్ట్.. పాక్‌లో స్వీట్లు అమ్ముకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు.. వీడియో చూడండి!