కేంద్ర ప్రభుత్వాన్ని గజగజా వణికించిన స్టార్ హీరో బాలయ్య మూవీ ఏదో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు( Balakrishna ) గత కొన్నేళ్ల నుంచి లక్ కూడా కలిసొస్తోంది.

బాలయ్య షోలు చేసినా, సినిమాలు చేసినా సక్సెస్ దక్కుతోంది.ఫ్యామిలీ ఆడియన్స్ లో బాలయ్యకు ఆదరణ పెరుగుతోంది.

బాలయ్య గత సినిమాలు 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.

బాలయ్య నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ కాగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారు.

సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

"""/" / అయితే బాలయ్య తొలి సినిమా తాతమ్మ కల( Tatamma Kala Movie ) అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్( Sr NTR ) మెయిన్ రోల్ లో నటించగా బాలయ్య కీలక పాత్రలో నటించారు.

14 సంవత్సరాల వయస్సులోనే ఈ సినిమాతో నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ మొదలైంది.

అయితే ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని గజగజా వణికించిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

"""/" / ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా సీన్లు, డైలాగ్స్ ఉండగా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఈ సినిమాపై బ్యాన్ విధించింది.

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Party ) కేంద్రంలో అధికారంలో ఉండేది.ఆ తర్వాత ఆ సీన్లకు సంబంధించి వివరణ ఇచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి తాతమ్మ కల సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించే పరిస్థితి అంటే ఈ సినిమా ఏ స్థాయిలో గజగజా వణికించిందో అర్థమవుతుంది.

వేడెవడండీ బాబు.. ఏకంగా మొసలి నోట్లోనే తలపెట్టేసాడు.!(వీడియో)