అలా చేస్తేనే బాలయ్య సినిమా హిట్.. సినిమాల్లో ఈ సెంటిమెంట్ గమనించారా?
TeluguStop.com
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ట్రెండ్ కు అనుగుణంగా తనను తాను మార్చుకునే బాలకృష్ణ ఎప్పుడూ నవయువకుడిలా ఫీలవుతారనే సంగతి తెలిసిందే.
అయితే బాలయ్య ఒక్కో సినిమాలో ఒక్కో తరహా గెటప్ లో కనిపిస్తారు.వేర్వేరు విగ్గులను వాడటం వల్ల సినిమా సినిమాకు బాలయ్య లుక్ మారిపోతుంది.
"""/"/
అయితే బాలయ్యకు విగ్( Balakrishna Wig ) సెట్ అయితే మాత్రం సినిమా సూపర్ హిట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
విగ్గు వల్ల బాలయ్య లుక్ ఘోరంగా ఉన్న సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఈ రీజన్స్ వల్లే బాలయ్య ప్రస్తుతం లుక్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అదే సమయంలో బాలయ్య స్టార్ స్టేటస్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ లు వచ్చాయి.
బోయపాటి శ్రీను, క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)( Gautamiputra Satakarni ), గోపీచంద్ మలినేని ఈ విషయాలను ప్రూవ్ చేశారు.
ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను సైతం క్రిష్ తెరకెక్కించినా సీనియర్ ఎన్టీఆర్ జీవితం( Senior NTR Life Story ) గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్లు ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపించలేదు.
బాలయ్య శైలికి తగిన కథను క్రిష్ ఎంచుకుని ఉంటే మాత్రం ఈ సినిమా కూడా సక్సెస్ ను సొంతం చేసుకునేది.
"""/"/
బాలయ్య భవిష్యత్తులో సైతం స్టార్ డైరెక్టర్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.ఆయన హోస్ట్ చేసిన ఓటీటీ షోలు( OTT Show ) సైతం సక్సెస్ సాధిస్తున్నాయనే సంగతి తెలిసిందే.
ప్రముఖ ఓటీటీల నుంచి బాలయ్యకు భారీ ఆఫర్లు వస్తున్నా బాలయ్య మాత్రం ఆ ఆఫర్లకు సున్నితంగా నో చెబుతున్నారు.
బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్3( Unstoppable Show 3 ) కు కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం.
చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?