లవ్ ప్రపోజ్ చేస్తే అలా షాకిచ్చానన్న అనుష్క.. ప్రేమను దాచుకోనంటూ?

40 సంవత్సరాల వయస్సు వచ్చినా అనుష్క శెట్టి పెళ్లికి దూరంగా ఉంటూ అభిమానులను హర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే సినిమాలు చేస్తున్న అనుష్క నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.సూపర్ సినిమాతో అనుష్క కెరీర్ ను మొదలుపెట్టింది.

ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా తెలుగులో అనుష్కకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.

ఎక్కువగా కష్టపడితే సినిమా రంగంలో ఎక్కువ కాలం రాణించడం సాధ్యమవుతుందని అనుష్క పేర్కొన్నారు.

సూపర్ మూవీ సమయంలో జరిగిన తప్పులను విశ్లేషించి తర్వాత సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడ్డానని ఆమె అన్నారు.

అరుంధతి సినిమాలో నటిస్తున్న సమయంలో చాలామంది రిస్క్ అని అన్నారని ఆమె తెలిపారు.

బిల్లా మూవీలో గ్లామర్ రోల్ లో కనిపించడం సాహసమే అని ఆమె కామెంట్లు చేశారు.

కొంతకాలం నేను టీచర్ గా పని చేశానని మూడో తరగతి విద్యార్థులకు నేను పాఠాలు చెప్పానని ఆమె అన్నారు.

ఎవరూ ఎవరి కన్నా గొప్ప కాదని అనుష్క చెప్పుకొచ్చారు.నేను ఎత్తుగా, సీరియస్ గా ఉంటానని అందువల్ల నాకు ప్రపోజ్ చెయ్యడానికి ఎవరూ ఇష్టపడే వారు కాదని ఆమె తెలిపారు.

అయితే ఒకసారి ఒక కుర్రాడు నాకు ప్రపోజ్ చేశాడని ఆ అబ్బాయితో "మా నాన్న దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పు" అని అన్నానని ఆమె కామెంట్లు చేశారు.

రిలేషన్ షిప్ కు, మ్యారేజ్ కు నేను వ్యతిరేకం కాదని ఆమె అన్నారు.

"""/"/ నేను లవ్ లో పడితే దాచుకోనని అన్ని విషయాలలా దాని గురించి కూడా తప్పకుండా చెబుతానని ఆమె కామెంట్లు చేశారు.

అనుష్క శెట్టి త్వరలో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్ తో ప్రేమ గురించి వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని ఆమె కామెంట్లు చేశారు.