సముద్ర గర్భంలో ఏలియన్ స్థావరం? కాలిఫోర్నియా తీరంలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..

సముద్ర గర్భంలో ఏలియన్స్ ఇక్కడే తిష్ట వేశాయా? అనే ప్రశ్న కాలిఫోర్నియా తీరంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

సదరన్ కాలిఫోర్నియాలోని మాలిబు తీరానికి సుమారు 6.6 మైళ్ల దూరంలో సముద్రం అడుగున ఓ వింత ఆకారం బయటపడింది.

దాని పేరు సికామోర్ నోల్ (Sycamore Knoll).చూడ్డానికి సముద్రం అడుగున పెద్ద గుట్టలా, పైన చదునుగా ఉన్న ఇది మనుషులు తయారు చేసిన నిర్మాణంలా అనిపించింది.

2014లో గూగుల్ ఎర్త్ ద్వారా దీని స్పష్టమైన చిత్రాలు బయటపడటంతో ప్రపంచం దృష్టి దీనిపై పడింది.

చాలా మంది ఇంటర్నెట్‌లో ఇదేదో ఏలియన్ల స్థావరం అయి ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే విచిత్రంగా 2025 నాటికి గూగుల్ ఎర్త్‌లో ఈ నిర్మాణం అస్పష్టంగా మారిపోయింది లేదా పూర్తిగా కనపడకుండా పోయింది.

కొందరు దీన్ని అప్‌డేట్ అయిన శాటిలైట్ చిత్రాల వల్ల అనుకుంటే, మరికొందరు మాత్రం ఇది ఏదో దాచిపెట్టే ప్రయత్నంలో భాగమే అని బలంగా నమ్ముతున్నారు.

"""/" / దీంతో ఈ మిస్టరీ మరింత పెరిగిపోయింది.సికామోర్ నోల్‌పై రకరకాల సిద్ధాంతాలున్నాయి.

కొందరు దీన్ని పూర్తిగా సహజసిద్ధమైన నిర్మాణం అంటే, మరికొందరు మాత్రం ఖచ్చితంగా దీనికి UFOలతో సంబంధం ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఓ రెడిట్ యూజర్ ఈ నిర్మాణం 2.5 నుంచి 3 మైళ్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.

ఈ మిస్టరీకి మరింత ఆజ్యం పోస్తూ, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బర్చెట్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

ఓ సీనియర్ నేవీ అడ్మిరల్ నీటి అడుగున ఒక వస్తువు మానవ సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యంకాని అత్యంత వేగంతో కదలడాన్ని చూసినట్లు ఆయన నివేదించారని బర్చెట్ వెల్లడించారు.

"""/" / ఇప్రముఖ జర్నలిస్ట్ జెరెమీ కార్బెల్ (Jeremy Corbell) 2023లో విడుదల చేసిన ఓ వీడియో ఈ మొత్తం వ్యవహారానికి మరో కోణం చూపించింది.

యూఎస్ఎస్ జాక్సన్ (USS Jackson) నౌక నుండి తీసిన ఆ ఫుటేజీలో పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక ప్రకాశవంతమైన, రెక్కలు లేని వస్తువు నీటిలోంచి పైకి వస్తున్నట్లు కనిపించింది.

ఈ "ట్రాన్స్మీడియం" (transmedium) UFO అంటే నీటితో పాటు గాలిలోనూ అత్యంత వేగంగా ప్రయాణించగలదు.

ఫేడ్ టు బ్లాక్ పాడ్‌కాస్ట్ హోస్ట్ జిమ్మీ చర్చ్ అయితే, రోస్‌వెల్ ఘటన తర్వాత సికామోర్ నోలే అతి పెద్ద UFO హాట్‌స్పాట్ కావచ్చని బాంబు పేల్చారు.

నేషనల్ UFO రిపోర్టింగ్ సెంటర్ వద్ద కూడా ఇలాంటివి చాలా నివేదికలు వచ్చాయి.

సముద్రం లోపలి నుంచి వింత ఆకారాలు, వాహనాలు పైకి రావడం తాము చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఒకరు అయితే ఒక మెరుస్తున్న, గుడి లాంటి భారీ నిర్మాణం నీటి లోపలికి కేవలం కొన్ని సెకన్లలో మాయమైపోవడాన్ని కళ్లారా చూసినట్లు వివరించారు.

ఈ సికామోర్ నోల్ వెనుక అసలు రహస్యం ఏంటో తెలియదు కానీ, UFOలు, ఏలియన్ థియరీలకు మాత్రం ఇదో హాట్‌ టాపిక్‌గా మారింది.