ఊర్వశివో రాక్షసివో సినిమాలో అన్ని లిప్ లాక్ సీన్లా.. ఫ్యాన్స్ షాకయ్యేలా?

అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ నెల 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని అల్లు శిరీష్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

ఈ సినిమాలో ఏకంగా 16 లిప్ లాక్ సీన్లు ఉన్నాయని తెలిసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కోలీవుడ్ సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా రొమాంటిక్ సీన్స్ తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే అను ఇమ్మాన్యుయేల్ కు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

యూత్ టార్గెట్ గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయేల్ హద్దులు లేకుండా ఈ సినిమాలో నటించారని సమాచారం అందుతోంది.

అల్లు శిరీష్ సినీ కెరీర్ లో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు మాత్రమే హిట్లుగా నిలిచాయి.

"""/"/ఊర్వశివో రాక్షసివో సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే రాకేశ్ శశికి కొత్త సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

రీమేక్ సినిమా కావడంతో పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా సక్సెస్ సాధించడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది.

అల్లు శిరీష్ ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ప్రసవం తర్వాత తల్లి పాలను పెంచే మ్యాజికల్ డ్రింక్ ఇది.. తప్పక ట్రై చేయండి!