అల్లు శిరీష్ ను ఆయన చెప్పుతో కొడతానని అన్నారా.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
అల్లు శిరీష్ తక్కువ సంఖ్యలో సినిమాలలో నటించగా ఆ సినిమాల్లో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
ఊర్వశివో రాక్షసివో సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న అల్లు శిరీష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
గీతా ఆర్ట్స్ సంస్థ కథకు ప్రాధాన్యత ఇస్తుందని శిరీష్ అన్నారు.మా కుటుంబం బయటి హీరోలతో కూడా సినిమాలు తీస్తుందని శిరీష్ చెప్పుకొచ్చారు.
గతంలో నేను ఏది అనుకుంటే అదే మాట్లాడేవాడినని సినిమా నచ్చకపోతే బాలేదని డైరెక్ట్ గా చెప్పేవాడినని శిరీష్ పేర్కొన్నారు.
అప్పట్లో కుర్రతనం, ఉడుకు రక్తం కాబట్టి అలా చెప్పేవాడినని శిరీష్ చెప్పుకొచ్చారు.గజినీ మూవీ హిందీ వెర్షన్ సినిమాకు నేను పని చేశానని శిరీష్ పేర్కొన్నారు.
బాల్యం నుంచి అమీర్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని శిరీష్ కామెంట్లు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గజిని హిందీ వెర్షన్ 200 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుందని శిరీష్ అన్నారు.
"""/"/
కమర్షియల్ హీరో స్థాయికి నేను ఇంకా చేరుకోలేదని ఆ స్థాయికి చేరుకోవడానికి సమయం పడుతుందని శిరీష్ కామెంట్లు చేశారు.
చిరంజీవి గారు నటించిన సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటని అల్లు శిరీష్ పేర్కొన్నారు.
ఒక్క క్షణం మూవీ కోసం బాగా కష్టపడ్డానని శిరీష్ చెప్పుకొచ్చారు.బన్నీకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాన్న కారు గిఫ్ట్ గా ఇచ్చారని శిరీష్ తెలిపారు.
"""/"/
నాకు కూడా కారు బహుమతిగా ఇవ్వాలని నాన్నను అడిగితే చెప్పుతో కొడతానని అన్నారని శిరీష్ చెప్పుకొచ్చారు.
మరోవైపు శిరీష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి శిరీష్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ నలుగురు స్టార్ హీరోల కోసం బాలీవుడ్ మేకర్స్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..?