ఆ హీరోయిన్ బట్టలు లేకుండా వచ్చినా పరవాలేదన్న ఏఎన్నార్.. షాకింగ్ విషయాలు రివీల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో ఏఎన్నార్ ఒకరు.

ఏఎన్నార్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్( Kanagala Jayakumar ) ఒక ఇంటర్వ్యూలో ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

దాసరి డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సినిమా షూటింగ్ జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో నాగేశ్వరరావు హీరో అని జయప్రద హీరోయిన్ అని ఆయన కామెంట్లు చేశారు.

జయప్రద కోసం అందరూ ఎదురుచూస్తున్నారని దాసరి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ను పిలిచి జయప్రదను ( Jayaprada )త్వరగా రావాలని చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.

అసిస్టెంట్ డైరెక్టర్ జయప్రద మేకప్ రూమ్ కు వెళ్లి తిరిగొచ్చి జయప్రద బట్టలు వేసుకుని వస్తానని చెప్పిందని దాసరికి చెప్పాడని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / దాసరి నారాయణరావు పక్కనే ఉన్న ఏఎన్నార్ ఏమయ్యా.బట్టలు లేకుండా వచ్చినా మాకేం అభ్యంతరం లేదని చెప్పయ్యా అని సరదాగా అన్నాడని కనగాల జయకుమార్ వెల్లడించారు.

నాగేశ్వరరావు చమక్కులు గమ్మత్తుగా ఉంటాయని ఆ చతురత ఏఎన్నార్ కే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఏఎన్నార్ హీరోయిన్లతో సరదాగా ఉంటారని ఎన్టీఆర్ ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని జయకుమార్ వెల్లడించారు.

"""/" / సంపూర్ణ రామాయణం షూటింగ్ సమయంలో ఎస్వీ రంగారావు రావణాసురుడి గెటప్ లో ఉండగా ఆయనకు రావాల్సిన సిగరెట్లు రాకపోవడంతో బీడీ కాల్చాడని ఆయన పేర్కొన్నారు.

ఒక ముసలావిడ ఎస్వీ రంగారావుపై సీరియస్ అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.కనగాల జయకుమార్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఏఎన్నార్ చివరి సినిమా మనం అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా అక్కినేని అభిమానులకు స్పెషల్ సినిమాగా నిలవడం గమనార్హం.

ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు