పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రముఖ నటి ఐశ్వర్య అర్జున్.. పెళ్లి కొడుకు ఎవరంటే?

ప్రముఖ శాండిల్ వుడ్, కోలీవుడ్ నటీమణులలో ఒకరైన ఐశ్వర్య అర్జున్( Aishwarya Arjun ) నటిగా కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నటి అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారని తెలుస్తోంది.త్వరలో ఐశ్వర్య రియల్ లైఫ్ లో పెళ్లికూతురు కానున్నారని సమాచారం అందుతోంది.

బెంగళూరులో జన్మించిన ఈ నటి తక్కువ సినిమాలే చేసినా ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచుకోవడం గమనార్హం.

"""/" / పట్టతు యానమ్ అనే సినిమాతో నటిగా ఐశ్వర్య కెరీర్ మొదలైంది.

తమిళ సినిమాతో కెరీర్ ను మొదలుబెట్టిన ఈ బ్యూటీ పదేళ్ల సినీ కెరీర్ లో చాలా తక్కువ సినిమాల్లోనే నటించారు.

అర్జున్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా ఐశ్వర్య అర్జున్( Arjun ) హీరోయిన్ గా ఒక ప్రాజెక్ట్ మొదలు కాగా వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

అయితే విశ్వక్ సేన్ కు బదులుగా మరో హీరోతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

"""/" / ఐశ్వర్య అర్జున్ వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఐశ్వర్య ఇప్పటికే కోలీవుడ్ సీనియర్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య( Umapathy Ramaiah )తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వీళ్లిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం అందుతోంది.

అయితే ఐశ్వర్య పెళ్లికి సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.ఐశ్వర్య అర్జున్ కెరీర్ పరంగా కూడా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఐశ్వర్య అర్జున్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సైతం సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

ఐశ్వర్య అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..