ఆదిపురుష్ చరిత్ర ముగిసినట్లే.. ఈ బుకింగ్స్ కు మించిన సాక్ష్యాలు కావాలా?

ప్రస్తుత కాలంలో ఒక ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే కనీసం 500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

టికెట్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు, పాప్ కార్న్ ఖర్చు కలిపితే కొంతమందికి ఇంకొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది.

రిక్లైనర్ సీట్ లో సినిమా చూడాలని అనుకుంటే కేవలం టికెట్ కోసమే 400 రూపాయలు ఖర్చు చేయాలి.

ప్రేక్షకులు సైతం సినిమాల విషయంలో తమ అభిప్రాయాలను మార్చుకున్నారు.మరో పాజిటివ్ టాక్ వస్తే తప్ప థియేటర్లలో సినిమాను చూడటానికి ఇష్టపడటం లేదు.

ఆదిపురుష్ మూవీ( Adipurush Movie ) మూడురోజుల ముచ్చట తీరిందని ఈరోజు నుంచి ఆదిపురుష్( Adipurush ) కు భారీ స్థాయిలో కలెక్షన్లు కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ లో బుకింగ్స్ ను పరిశీలిస్తే అటు త్రీడీలో కానీ ఇటు 2డీలో కానీ ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే సంగతి తెలిసిందే.

"""/" / హైదరాబాద్( Hyderabad ) లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఆశించిన రేంజ్ లో అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆదిపురుష్ సినిమా చరిత్ర ముగిసినట్లేనని ఈ సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో కలెక్షన్లను ఆశిస్తే మాత్రం అత్యాశే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా నష్టాలు భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. """/" / ఓం రౌత్( Director Om Raut ) మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమాను మేము ఒక విధంగా ఊహించుకున్నామని ఈ సినిమా మాత్రం మరో విధంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ మూవీ 200 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉంది.

ఈ నష్టాలను మేకర్స్ ఏ విధంగా భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్( Prabhas ) తన సినిమాల బడ్జెట్ల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది.

ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట