జయలలిత అనే పేరు వల్ల ఈ నటిని టార్చర్ చేశారా.. రాళ్లు విసిరారంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన జయలలిత( Jayalalithaa ) ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాలోని నటిని సినిమా ఇండస్ట్రీ వినియోగించుకోలేదని చెబుతానని ఆమె అన్నారు.విశ్వనాథ్ ( Vishwanath )గారి డైరెక్షన్ లో, భారతీరాజా( Bharti Raja ) గారి డైరెక్షన్ లో చేశానని రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) డైరెక్షన్ లో చేశానని ఎవరి డైరెక్షన్ లో చేసినా కేవలం వచ్చీ పోయే పాత్రలు మాత్రమే ఇచ్చారని ఆమె అన్నారు.

భాగ్యం రోల్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని జయలలిత చెప్పుకొచ్చారు.ఒక లేడీ అయిన నా క్యారెక్టర్ ఇమేజ్ ను ఎందుకు మార్చలేదని అనిపిస్తుందని ఆమె తెలిపారు.

సినిమా రంగానికి ఎందుకు వచ్చానా అని బాధ పడలేదని అయితే నా డ్యాన్స్ లైఫ్ పోయిందని వ్యాంప్ అని ముద్ర పడిందని సంతృప్తి లేకుండా పోయిందని అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు.

మంజు భార్గవి గారి జీవితాన్ని శంకరాభరణం మార్చిందని నాకు కూడా అలాంటి మూవీ వచ్చి ఉంటే బాగుండేదని జయలలిత చెప్పుకొచ్చారు.

"""/" / శృతి లయలు, ఇంద్రుడు చంద్రుడు మరికొన్ని సినిమాలలో వ్యాంప్ రోల్స్ లో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.

ధర్మక్షేత్రం సినిమాలోని రోల్ గురించి మాట్లాడుతూ ఆ సినిమా షూట్ సమయంలో బాలయ్య బాబు జయమ్మా బయటకు రా జయమ్మా బయటకు రా అని పిలుస్తున్నాడని ఏంటండీ అంటే రా నీ ఫ్యాన్ వచ్చాడు నువ్వు చూడాలి అని పిలిచాడని జయలలిత పేర్కొన్నారు.

"""/" / నేను వెళితే అక్కడ చిన్న పిల్లాడు బోరింగ్ పాప బోరింగ్ పాప అన్నాడని ఆమె తెలిపారు.

అమ్మ నాన్న పెట్టిన పేరు లలిత అని నేను ఒకటో తరగతిలో జయలలిత అని పేరు స్కూల్ లో చెప్పానని ఆమె తెలిపారు.

నా పేరు వల్ల తమిళంలో రాజకీయ నేత జయలలిత అవకాశాలు రాకుండా చేశారని అలాంటి పాత్రలు వేశానని మా ఇంటిపై జయలలిత పార్టీ వాళ్లు రాళ్లు విసిరారని పేరు మార్చుకోవాలని డిమాండ్ చేశారని జయలలిత చెప్పుకొచ్చారు.

కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)