సినిమాల్లో విలన్ అయిన ఈ నటుడి మంచి మనస్సు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియళ్లలో, సినిమాలలో విలన్ రోల్స్ లో నటించడం ద్వారా పాపులర్ అయిన నటులలో మధుసూదన్ రావు కూడా ఒకరు.
తాజాగా మధుసూదన్ రావు ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.1997లో రుతురాగాలు సీరియల్ లో చేశానని ఆయన కామెంట్లు చేశారు.
మంజులా నాయుడు గారి సీరియళ్లలో మంచి పేరు వచ్చిందని మధుసూదన్ రావు అన్నారు.
యాక్టింగ్ విషయంలో రాజీవ్ కనకాల ఎంతో సహాయం చేశారని ఆయన కామెంట్లు చేశారు.
రాజకీయాల్లోకి రావాలని కూడా కోరిక ఉందని మధుసూదన్ రావు అన్నారు.చక్రవాకం సీరియల్ తో మంచి గుర్తింపు దక్కిందని ఆయన తెలిపారు.
ఆ సీరియల్ లో తాను పోషించిన జేమ్స్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైందని మధుసూదన్ రావు అన్నారు.
నేను సినిమాల్లో విలన్ గా నటించడానికి దేవ కట్టా కారణమని ఆయన తెలిపారు.
మా అక్క పిల్లల బాధ్యత నేనే తీసుకున్నానని మధుసూదన్ రావు తెలిపారు. """/" / తాను సినిమాల్లో విలన్ అయినా రియల్ లైఫ్ లో విలన్ కాదని ఆయన చెప్పకనే చెప్పేశారు.
నేనెవరి చెడు కోరుకోలేదని చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.కొన్ని తలచుకుంటే కంట్లో నీళ్లు వచ్చేస్తాయని మధుసూదన్ రావు తెలిపారు.
ఆరు భాషల్లో నేను నటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. """/" /
సిగరెట్ తాగితే డబ్బులు వేస్ట్ అవుతాయని బీడీ తాగిన సందర్భాలు ఉన్నాయని ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే నా వంతు సహాయం నేను చేస్తానని మధుసూదన్ రావు కామెంట్లు చేశారు.
నేను సంపాదించింది నేను ఖర్చు పెడుతున్నానని ఆయన అన్నారు.మధుసూదన్ రావు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మధు సూదన్ రావు కెరీర్ లో ఎన్నో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!