ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు చేదు అనుభవం.. కుర్రాళ్లు ఇంత పని చేశారా?

ప్రేమలు సినిమా( Premalu Movie ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మమితా బైజు( Mamitha Baiju ) పేరు భాషతో సంబంధం లేకుండా మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే.

ప్రేమలు సినిమా సక్సెస్ తో మమితా బైజుకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

అయితే మమితా బైజుకు తాజాగా చేదు అనుభవం ఎదురు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రేమలు సినిమాతో మమితా బైజు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయారు.

చెన్నైలోని ఒక జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కు( Jewellery Shop Opening ) మమితా బైజు హాజరు కాగా ఆమెను చూడటానికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

కుర్రాళ్లు ఆమెను చుట్టుముట్టడంతో షాకవ్వడం ఆమె వంతైంది.బౌన్సర్ల సహాయంతో ఎంతో కష్టపడి మమితా బైజు షాప్ లోకి వెళ్లారు.

అభిమానుల అభిమానాన్ని చూసి షాకవ్వడం మమితా బైజు వంతు అయిందని సమాచారం అందుతోంది.

"""/" / ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు( Kajal Aggarwal ) సైతం ఈ తరహా అనుభవం ఎదురైందనే సంగతి తెలిసిందే.

మమితా బైజు తెలుగులో మరిన్ని సినిమాలలో నటించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మమితా బైజు కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.మమితా బైజు రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉంది.

"""/" / మమితా బైజు సౌత్ లో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

సోషల్ మీడియాలో సైతం మమితా బైజు ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

మమితా బైజు యువతకు క్రష్ గా మారిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మమితా బైజు చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆమెకు ప్లస్ అవుతోంది.

ప్రేమలు మమితా బైజు ఫస్ట్ సినిమా అని చాలామంది భావిస్తారు.ఆమె యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే … ? టీటీడీ క్లారిటీ