అమెరికాలో దారుణం .. పొదల్లో బయటపడ్డ తల లేని మొండెం , ఎవరిది..?

అమెరికాలో దారుణం జరిగింది.గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు( Greater Manchester Police ) ప్లాస్టిక్‌తో చుట్టబడిన తల లేని మానవ మొండెంను కనుగొన్నారు.

సాల్‌ఫోర్డ్‌లోని కెర్సల్ వెట్‌ల్యాండ్స్‌లో( Kersal Wetlands, Salford ) గురువారం సాయంత్రం మృతదేహాన్ని కనుగొన్నారు.

మృతుడికి దాదాపు 40 ఏళ్ల వయసు వుండొచ్చని.మరణించి కొన్ని రోజులు గడిచి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

డాగ్ స్క్వాడ్, పరిశోధక బృందాలు, ఫోరెన్సిక్ యూనిట్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహానికి సంబంధించిన ఇతర శరీర భాగాల కోసం పోలీసులు ఈ ప్రాంతాన్ని శోధిస్తున్నారు.

కాని ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని పరిశోధకులు చెబుతున్నారు.అయితే మృతదేహం ఎవరిది.

ఎలా మరణించారన్న విషయాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. """/" / సాల్‌ఫోర్డ్ జిల్లా కమాండర్ చీఫ్ సూపరింటెండెంట్ టోనీ క్రీలీ( Tony Creeley ) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.

ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.వీలైనంత త్వరగా మృతుడు ఎవరన్న దానిని గుర్తిస్తామని.

ఇందుకోసం అందుబాటులో వున్న అన్ని ఫోరెన్సిక్ పద్థతులను ఉపయోగిస్తున్నామని టోనీ తెలిపారు.మరణించింది పురుషుడా, స్త్రీ అనే విషయాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేదన్నారు.

గురువారం సాయంత్రం ప్లాస్టిక్‌తో చుట్టి వున్న అవశేషాలను స్థానికులు గుర్తించగా.పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.

"""/" / తొలుత మృతదేహం పెద్దలది అయివుండొచ్చని పోలీసులు భావించారు.డైలీ మెయిల్ వార్తా సంస్థ కథనం ప్రకారం.

మొండానికి తల, చేతులు లేవని పేర్కొంది.ఫోరెన్సిక్ అధికారులు ఆ ప్రాంతంలో దర్యాప్తు కొనసాగిస్తున్నందున ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఈ భయానక ఘటనపై ఏదైనా సమాచారం వుంటే తక్షణం తమను సంప్రదిచాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డిటెక్టివ్‌లు, ఫోరెన్సిక్ బృందాలు కొంతకాలం ఘటనాస్థలిలోనే వుంటాయని పోలీసులు వెల్లడించారు.వారు ఈ ప్రాంతంలో బాటసారులు, డాగ్ వాకర్స్ నుంచి సమాచారాన్ని సేకరిస్తారని వెల్లడించారు.

కేసుకు సంబంధించి ఇంకా చాలా సమాధానాలు లేని ప్రశ్నలు వున్నాయని చీఫ్ సూపరింటెండెంట్ అన్నారు.

వీలైనంత త్వరగా చిక్కుముడులు విప్పేందుకు అధికారులు శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆరోగ్యానికి తోడుగా ఉండే నేరేడు.. వర్షాకాలంలో మిస్ అయ్యారో చాలా నష్టపోతారు!