షాకింగ్: కాస్ట్లీ ప్రయాణం అంటే ఇదేనేమో... పావుగంటకి రూ. 32 లక్షలు ఛార్జ్ చేసిన ఊబర్!
TeluguStop.com
షాకింగ్ అవ్వొద్దు, మీరు విన్నది నిజమే.ఈమధ్య ఇలాంటివి ఎక్కువైపోయాయి, తరచూ జరుగుతున్నాయి.
ఎవడబ్బ సొమ్మన్నట్టు సో కాల్డ్ కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయో తెలియడంలేదు.
లేకపోతే కారులో పావుగంట సేపు అంటే సుమారుగా ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే రూ.
32 లక్షలు ఛార్జ్ చేసిన ఘనత ఇలాంటి ఊబర్, ఓలా కంపెనీలకే చెల్లింది.
అంత దూరం ప్రయాణానికి మహా అయితే రూ.100 నుంచి రూ.
150 వరకు బిల్లు అవుతుంది.కానీ అంతే దూరం ప్రయాణం చేసిన ఓ వ్యక్తికి ఉబర్ సంస్థ తేరుకోలేని షాక్ ఇచ్చింది.
అవును, ఈ అరుదైన ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, ఇంగ్లాండ్ కి చెందిన ఒలివర్ కప్లన్ అనే యువకుడు స్నేహితులతో కలసి మందు పార్టీ చేసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళడానికి ఎప్పటిలాగే Uber కేబ్ బుక్ చేసుకున్నాడు.
తాను బుక్ చేసుకున్న గమ్యానికి చేరుకున్నాడు.అయితే మనోడు నిద్రమత్తులో బిల్లు చూడలేదు.
అలాగే వెళ్లి పడుకుండిపోయాడు.మరుసటి రోజు కళ్ళు తెరిచి బిల్లు చూసి బిత్తరబోయాడు.
"""/"/
అవును, Uber సంస్థ ఏకంగా రూ.32 లక్షలకు పైగా బిల్లు వేసింది.
అంటే 35,427 డాలర్లు చార్జ్ చేసిందన్నమాట.ఒలివర్ ఆ షాక్ నుంచి తేరుకుని ఉబర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా వారు చెప్పిన కారణంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.
విషయం ఏమంటే డ్రాపింగ్ లొకేషన్ పేరు ఆస్ట్రేలియా అని తప్పుగా పడటంతో బిల్లు ఎక్కువగా వచ్చినట్టు ఉబర్ వివరణ ఇచ్చింది.
ఈ అసౌకర్యానికి తమను క్షమించమని ఉబర్ కోరిందని కూడా చెప్పాడు.ఏదిఏమైనా ఉబర్ షాక్‌తో ఒలివర్‌కు మద్యం మత్తు మొత్తం దిగిపోయింది.
ఇంకెప్పుడూ తాగి ప్రయాణించానని చెప్పుకొచ్చాడు.
ది రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్ దెయ్యం రోల్ లో కనిపిస్తారా.. అసలు నిజాలివే!