రజనీకాంత్ ను బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు దానం చేసిన మహిళ.. చివరకు?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో టాలెంటెడ్ కాగా జైలర్ సినిమా( Jailer Movie )తో రజనీకాంత్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది.

జైలర్ సినిమాకు సీక్వెల్ కూడా కన్ఫామ్ కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే రజనీకాంత్ ను బిచ్చగాడు అనుకుని ఒక మహిళ ఒక సందర్భంలో 10 రూపాయలు దానం చేసింది.

రజనీకాంత్ లుక్ ను మార్చుకోవడంతో సదరు మహిళ రజనీకాంత్ ను ఆ సమయంలో గుర్తుపట్టలేదు.

"""/" / 2007 సంవత్సరంలో శివాజీ సినిమా( Sivaji Movie ) విడుదలైన తర్వాత రజనీకాంత్ దేవుడిని దర్శించుకోవడానికి గుడికి వెళ్లారు.

రజనీకాంత్ మారు వేషంలో గుడికి వెళ్లగా ఆయన వృద్ధుడిలా ఉండటంతో ఎవరూ గుర్తు పట్టలేదు.

ఒక మహిళ ఆ సమయంలో రజనీకాంత్ బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు ఇచ్చారు.

రజనీకాంత్ ఆ పది రూపాయలు తీసుకుని ఏమీ అనకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. """/" / ఆ తర్వాత రజనీకాంత్ ( Rajanikanth )గుడి హుండీలో డబ్బులో వేసి ఖరీదైన కారు ఎక్కడాన్ని ఆ మహిళ గమనించి కారు ఆపారు.

ఆ సమయంలో రజనీకాంత్ ను గుర్తించిన మహిళ రజనీకి క్షమాపణలు చెప్పి తాను ఇచ్చిన 10 రూపాయలు వెనక్కు ఇవ్వాలని కోరారు.

ఆ సమయంలో రజనీకాంత్ మాట్లాడుతూ ప్రతిసారి దేవుడు తన ముందు నేనొక బిచ్చగాడినని ఏదో ఒక విధంగా గుర్తు చేస్తుంటాడని రజనీకాంత్ తెలిపారు.

ఆ దేవుడు ఆడిన నాటకంలో మీరు ఒక సాధనం అని రజనీకాంత్ అన్నారు.

రజనీకాంత్ తన ఆటో బయోగ్రఫీ ద్వారా ఈ విషయాలను వెల్లడించగా ఈ విషయాలు వైరల్ అయ్యాయి.

రజనీకాంత్ పారితోషికం ప్రస్తుతం 110 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది.రజనీకాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

రజనీకి మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య..