పిన్నెల్లి విషయంలో కుట్ర బట్టబయలు.. పోలీసులే ప్లాన్ చేసి పిన్నెల్లిని ఇరికించారా?

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో షాకింగ్ మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

ఈ కేసుకు సంబంధించి డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

పిన్నెల్లిపై కేసుల నమోదుకు సంబంధించి రికార్డులు తారుమారు చేసినట్టు సాక్ష్యాలు లభించినట్లు తెలుస్తోంది.

హైకోర్టులో వాదనల సమయంలో పోలీసుల తీరు విషయంలో హైకోర్టు( High Court ) విస్మయం చెందినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం జీవో లేకుండా రూల్స్ ను పాటించకుండా లాయర్ అశ్వనీకుమార్ పోలీసుల తరపున వాదనలకు దిగారని భోగట్టా.

మరోవైపు టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

డీజీపీ, పల్నాడు పోలీసుల తీరు పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈవీఎం డ్యామేజీ కేసులో( EVM Damage Case ) జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి పల్నాడులో లేకుండా చేసే కుట్ర కూడా జరిగిందని భోగట్టా.

"""/" / హత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై గతంలో నమోదు చేయకుండా మే 22వ తేదీన నమోదు చేసినట్టు పోలీసులు హైకోర్టుకు తాజాగా వెల్లడించారు.

పోలీసుల వాదనల విషయంలో పిన్నెల్లి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

హైకోర్టు సైతం రికార్డులను వెంటనే పరిశీలించి పిన్నెల్లిపై మే 23న అదనంగా కేసులు నమోదు చేసినట్లు గుర్తించింది.

"""/" / పోలీసులు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారంటే పిన్నెల్లి విషయంలో కుట్ర ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది.

పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఆ తీర్పును సమర్థించడానికి స్పెషల్ కౌన్సిల్ ను కూడా పెట్టారని పిన్నెల్లి తరపు న్యాయవాది తెలిపారు.

కోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల( AP Police ) తీరుపై తీవ్ర చర్చ జరిగిందని సమాచారం.

పోలీసుల తరపున హాజరవుతున్న న్యాయవాదుల విషయంలో సైతం న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇదేం పోయేకాలం మీకు..విజయ్ దేవరకొండ ఏం చేసినా తప్పు పడితే ఎలా ?