Krishna Vamsi Mahesh Babu : మహేష్ కెరీర్ కు కావాలంటే ఆ చండాలాన్ని పెట్టుకోండి.. ఆ సమయంలో కృష్ణవంశీ అలా అన్నారా?
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ వరుస విజయాలను అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఊహించని స్థాయిలో లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ఈ హీరో గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు.
గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )లో కథ పరంగా కొన్ని తప్పులు ఉన్నా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.
మహేష్ బాబు కృష్ణవంశీ కాంబోలో తెరకెక్కిన మురారి మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా విడుదలై నిన్నటికి 23 సంవత్సరాలు పూర్తైంది.ఈ సినిమాలోని అలనాటి రామచంద్రుడి పాట( Alanati Ramachandrudi Song ) ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
"""/"/ మురారి సినిమా( Murari Movie )లో ప్రీ క్లైమాక్స్ సమయంలో ఈ సాంగ్ వస్తుంది.
అయితే ప్రీ క్లైమాక్స్ లో అలనాటి రామచంద్రుడు సాంగ్ వద్దని కమర్షియల్ సాంగ్ పెట్టాలని కృష్ణగారు కృష్ణవంశీని కోరారట.
ఆ సమయంలో కృష్ణవంశీ కృష్ణగారికి రెండు ఆప్షన్లు ఇచ్చారు.ఒకటి ఈ సినిమా, పాటను తనను చేయనీయాలని రెండోది ఈ సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతానని మీరు కమర్షియల్ సాంగ్ చేసి విడుదల చేసుకోవాలని కృష్ణవంశీ కృష్ణకు సూచించారు.
అలనాటి రామచంద్రుడు సాంగ్ అయితే దశాబ్దాల పాటు ఉండిపోతుందని మీ అబ్బాయి కెరీర్ కు కావాలంటే కమర్షియల్ సాంగ్ అనే చండాలాన్ని పెట్టుకోండి అని కృష్ణవంశీ( Krishna Vamsi ) అన్నారట.
"""/"/
అయితే కృష్ణవంశీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి కృష్ణగారు అలనాటి రామచంద్రుడు సాంగ్ కు అంగీకరించడం సాంగ్, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది.
సినిమా విడుదలై 23 ఏళ్లు అయినా ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.
దేవత కోపానికి కారణమైన ఒక వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఈ సినిమా ముందువరసలో ఉంటుంది.
మురారి మూవీ తర్వాత మహేష్, కృష్ణవంశీ కాంబోలో మరో సినిమా రాలేదనే సంగతి తెలిసిందే.
చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ రెమెడీతో శాశ్వతంగా వదిలించుకోండి!