ఎన్టీఆర్ ఉసరవెల్లి మూవీకి 12 ఏళ్లు.. ఇప్పుడు విడుదలై ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదా?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సురేందర్ రెడ్డి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్ లో అశోక్, ఊసరవెల్లి సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.
ఎన్టీఆర్ ఊసరవెల్లి మూవీ( Oosaravelli Movie ) ఇప్పటికే విడుదలై 12 సంవత్సరాలు అయింది.
ఈ సినిమా రిలీజ్ సమయంలో మిక్స్డ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా అద్భుతంగానే ఉన్నా ఈ సినిమాలోని సెకండాఫ్ లోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.
ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేసి ఉంటే మాత్రం ఈ మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
"""/" /
ఈ సినిమా ఫ్లాప్ కావడానికి తమన్నా( Tamanna ) ఓవరాక్టింగ్ కూడా కారణమని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ లుక్ మాత్రం ఈ సినిమాలో కొత్తగా ఉంటుందనే సంగతి తెలిసిందే.ఊసరవెల్లి సినిమాకు బీ.
ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.ఊసరవెల్లి అంచనాలను అందుకోకపోయినా నిర్మాతలకు నష్టాలను మాత్రం మిగల్చలేదు.
"""/" /
రెండు నెలల క్రితం విడుదలైన భోళా శంకర్( Bhola Shankar Movie ) మూవీ కథ, కథనాలు సైతం ఊసరవెల్లి సినిమాను పోలి ఉంటాయనే సంగతి తెలిసిందే.
ఊసరవెల్లిలా భోళా శంకర్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది.జూనియర్ ఎన్టీఆర్ కు తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో( Devara ) నటిస్తుండగా దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!