అయోధ్య రామ మందిరానికి ఇప్పటివరకు వచ్చిన విరాళాల లెక్క ఇదే.. ఎక్కువ మొత్తం ఇచ్చిన భక్తుడెవరంటే?

అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Mandir ) ఓపెనింగ్ కు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రముఖులకు ఆహ్వానం అందింది.

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లనున్నారు.

ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.29 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా జనవరి నెల 15వ తేదీన రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురానున్నారు.

ఈ నెల 16వ తేదీన ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలుకానుండగా ఈ నెల 17న శ్రీరాముని విగ్రహం నగర ఊరేగింపు కార్యక్రమం జరగనుంది.

ఈ నెల 18వ తేదీన వాస్తు పూజ, వరుణ పూజ, ఇతర పూజలు జరగనున్నాయని సమాచారం అందుతోంది.

19వ తేదీన యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరగనుండగా జనవరి 20న 81 కలశాలతో పుణ్యవహచనం కార్యక్రమం జరగనుందని సమాచారం అందుతోంది.

జనవరి 21వ తేదీన జలాధివాసం కార్యక్రమం జరగనుండగా జనవరి 22వ తేదీన ప్రధాన కార్యక్రమం జరగనుంది.

ఈ నెల 24వ తేదీ నుంచి భక్తులను అనుమతించనున్నారని సమాచారం అందుతోంది.అయోధ్య నూతన రామాలయ నిర్మాణం కోసం ఇప్పటివరకు 3200 కోట్ల రూపాయల మొత్తం రాగా ఈ మొత్తాన్ని ఫిస్క్డ్ డిపాజిట్ చేశారు.

ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.

"""/"/ అధ్యాత్మిక గురువు మొరారీ బాపు ఈ ఆలయానికి ఎక్కువ మొత్తంలో విరాళం ఇచ్చిన వ్యక్తిగా నిలిచారు.

ఈ ఆలయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అనుమతులు ఇచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఛాన్స్ ఉంది.

త్వరలో అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లక్షల సంఖ్యలో భక్తులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

దారుణం.. లోకో పైలట్ దారుణ హత్య చేసిన దుండగుడు(వీడియో)